రాష్ట్రీయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తానన్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 16: గ్యాంగ్‌స్టర్ నరుూంతో నల్గొండ జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ నేతలకు, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, నరుూం కేసుల దర్యాప్తుకు ప్రభుత్వం నియమించిన సిట్‌పై నమ్మకం లేదని, ఈ కేసును సిబిఐ ద్వారా విచారిస్తేనే వాస్తవాలు బయటపడతాయని కాంగ్రెస్ నేత, నల్లగొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ రైతు గర్జన బహిరంగ సభలో రాజగోపాల్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగిస్తూ రాజకీయంగా తనను దెబ్బతీయడానికి నరుూం ముఠా పలుమార్లు బెదిరించారని, గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తానని నరుూం స్వయంగా హెచ్చరించాడని ఆయన గద్గదస్వరంతో వాపోయారు. యుద్థంలోకి వెళ్ళిన తాను చావుకు కూడా భయపడకుండా ఎన్నికల్లో పోటీచేశానని అన్నారు. నరుూం దురాఘతాలకు అంతులేకుండా పోయిందని, ఆ డైరీలో నరుూం ముఠాతో సంబంధం ఉన్న రాజకీయ నేతల వివరాలను దమ్ముంటే బయటపెట్టాలని ఆయన కెసిఆర్‌కు సవాల్ విసిరారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి నరుూంతో లింకు ఉందని, లోతుగా దర్యాప్తు జరిపితే టిఆర్‌ఎస్ నేతల బండారమంతా బయటపడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌పై నమ్మకం లేదని, వెంటనే సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని, ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాల్సిందిగా కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతు గర్జన ద్వారా భారీ జనం చూస్తూంటే కెసిఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహులైన తుమ్మల నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను మంత్రి వర్గంలోకి తీసుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కెసిఆర్ తాకట్టుపెట్టారని కోమటిరెడ్డి విమర్శించారు.