రాష్ట్రీయం

ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే పెట్రోల్ ఫోర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 17: జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ‘నేషనల్ హైవే పెట్రోల్ ఫోర్స్’ ఏర్పాటు చేసేందుకు ప్రాథమిక ప్రతిపాదనలు పూర్తయ్యాయని రవాణా శాఖ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నెల 19 నుంచి రెండు రోజుల పాటు విశాఖలో జరగనున్న జాతీయ రహదారి భద్రత సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశాఖ వచ్చిన ఆయన బుధవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు.
ప్రమాదాల నియంత్రణపై మంత్రుల బృందంతో జరిగిన భేటీలో రవాణాశాఖ చేసిన ప్రతిపాదన చర్చకు వచ్చిందన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రుల బృందం ఫోర్స్ ఏర్పాటు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 400 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయని, 42 శాతం రోడ్డు ప్రమాదాలు జాతీయ రహదారులపైనే జరుగుతున్నాయని తెలిపారు. దీంతో ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక ఫోర్స్ అవసరాన్ని గుర్తించామన్నారు. ఫోర్సుకు అవసరమైన సిబ్బందిని రవాణా, పోలీసు, ఇతర శాఖల నుంచి తీసుకునేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఫోర్స్ నిర్వహణ, సిబ్బంది జీత,్భత్యాలు, వాహనాల ఖర్చులు జాతీయ రహదారి విభాగం భరించేలా కేంద్రాన్ని ఒప్పించనున్నట్టు తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు కేంద్రం కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తమ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో రెండు రోజుల పాటు జరుగుతున్న జాతీయ రహదారి భద్రత సదస్సులో పాల్గొనే కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి ఈ అంశానికి తుదిరూపునివ్వనున్నట్టు ఆయన తెలిపారు. కాగా, ఇటీవల కాలంలో రవాణా శాఖ తీసుకున్న పలు చర్యల వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని కమిషనర్ సుబ్రహ్మణ్యం గుర్తుచేశారు. వాహనాల ఫిట్నెస్ తనిఖీని కట్టుదిట్టం చేయడం ద్వారా కండిషన్‌లో లేని వాహనాల ఉపయోగం తగ్గుముఖం పట్టిందని, తద్వారా ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. రవాణా శాఖ నిర్వహించే వాహనాల ఫిట్నెస్ సెంటర్లను పూర్తిగా ఆధునీకరించడం ద్వారా 50 నుంచి 60 శాతం సక్రమమైన వాహనాలే ఫిట్నెస్ సర్ట్ఫికెట్ తీసుకుంటున్నాయన్నారు. వాహనంతోపాటు డ్రైవర్ ఫోటోలు ఆన్‌లైన్‌లో పొందుపరచడం వల్ల మంచి ఫలితాలు రాబట్టగలిగామని, అలాగే అధిక లోడుతో వెళ్లే వాహనాలను కూడా నియంత్రించగలిగామని చెప్పారు. విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ వల్ల పారదర్శకత పెరిగిందని, గతంలో 100 శాతం లైసెన్సులు, ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీ అవగా, గత ఏప్రిల్ నుంచి ఇది 32 శాతానికి పడిపోయిందని వివరించారు. త్వరలోనే విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, ఏలూరు ప్రాంతాల్లో కూడా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
మరోవైపు రవాణా శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా కమిషనర్ చెప్పారు. పరిపాలనా విభాగంలో 800 మందితో కలిపి, మొత్తం 2,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్పష్టం చేశారు. పోస్టుల భర్తీ ద్వారా మరింత విస్తృత సేవలందించేందుకు వీలుంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు కూడా ఆయన తెలిపారు. అలాగే రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తనిఖీల్లో పోలీసు సిబ్బందిని కోరుతున్నట్టు సుబ్రహ్మణ్యం వెల్లడించారు.