రాష్ట్రీయం

ప్రొఫెసర్ రాయ్‌కు ఇస్రో అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ పి ఎస్ రాయ్‌కు ప్రతిష్టాత్మకమైన ఇస్రో ప్రతిభా అవార్డు దక్కింది. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఎర్త్ అండ్ స్పేస్ సైనె్సస్‌లో ఎన్‌ఎఎస్‌ఐ సీనియర్ సైంటిస్టుగా కొనసాగుతున్నారు. యుసిఇఎస్‌ఎస్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన డాక్టర్ కె ఎల్ రావు జియో స్పేషియల్ చైర్ ప్రొఫెసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. తాజాగా ఇస్రో ప్రొఫెషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. ఈ అవార్డు కింద ఐదు లక్షల రూపాయిల నగదు, ఒక సర్ట్ఫికేట్‌ను, మెడల్‌ను ఇస్తారు. సహజవనరుల వినియోగంలో విశిష్టమైన పరిశోధనల ద్వారా రాయ్ ఎంతో గుర్తింపు పొందారు.