రాష్ట్రీయం

హామీలన్నీ నెరవేరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్‌కు విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేరుస్తుందని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం వెల్లడించారు. బిజెపి తిరంగా యాత్రలో భాగంగా మంగళవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన స్వాతంత్య్ర సమరయోధుల పార్కులోని యోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సమర్పించే డిపిఆర్‌లను సమీక్షించి, పోలవరం ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తిచేయడానికి కృషిచేస్తామన్నారు. విభజనవల్ల నష్టపోయిన ఎపి అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ.1.7 లక్షల కోట్లను మంజూరు చేసిందన్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ ద్వారా గత మూడేళ్లలో రూ.1579 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆంధ్రాలో రూ.3000 కోట్లతో కార్మిక బీమా ఆసుపత్రులను ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. విశాఖపట్నంలో రూ.1500 కోట్లతో 500 పడకల ఆసుపత్రి, విజయనగరం, విజయవాడ, తిరుపతి, ఆదోనిలో 200 పడకల ఆసుపత్రులను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం ఇఎస్‌ఐ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. పైడి భీమవరంలో కూడా ఇఎస్‌ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. రాయలసీమ విద్యుత్ అవసరాలను తీర్చడానికి కడపలో నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును మంజూరుచేసినట్లు దత్తాత్రేయ వివరించారు. రూ.1560 కోట్లతో ఎయిమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అభివృద్ధే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోటీపడాలని, ఇందుకు కేంద్రం కూడా సహకరిస్తుందన్నారు. 2022 నాటికి కార్మికులతో సహా పేదలందరికీ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2న కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్మిక సంఘాలు లేవనెత్తిన 12 డిమాండ్లపై మంగళవారం అరుణ్‌జైట్లీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ కమిటీ సమావేశమై చర్చించిందన్నారు. ఏడు రకాల కార్మికులకు కనీస వేతనాలను పెంచాలని కనీస వేతనాల బోర్డుకు నివేదించామన్నారు.

చిత్రం.. రాజమహేంద్రవరంలో తిరంగా యాత్రలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ