రాష్ట్రీయం

ప్లాట్లను తిరిగి ఇప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఆగస్టు 17: నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీలక్ష్మినరసింహనగర్‌లో ప్లాట్ల యజమానుల నుండి నరుూం అనుచరులు పాశం శ్రీను, సందెల సుధాకర్, షకీల్ ఆక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్లాట్లను తిరిగి ఇప్పించాలని కోరుతూ 25 మంది బాధితులు సిట్ పోలీసు అధికారి శ్రీ్ధర్, భువనగిరి రూరల్ ఎస్‌ఐ సాజిదుల్లాకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ భువనగిరి పట్టణంలోని 722, 723,724, 726,727, 728, 731, 732, 733 సర్వే నెంబర్లలో ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మినరసింహనగర్ తాము 1996 సంవత్సరంలో ప్లాట్లను కొనుగోలు చేశామని అనంతరం 2010లో ప్లాట్లలో నిర్మాణం పనులు చేపట్టేందుకు రాగా నరుూం అనుచరులు తమను అటకాయించి ప్లాట్లను పూర్తిగా నరుూం అన్న కొనుగోలు చేశాడని చెప్పి ప్లాట్లలోకి అడుగుపెడితే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. గతంలో చేసిన లేఅవుట్‌ను పూర్తిగా తొలగించి సరికొత్త లేఅవుట్‌ను సృష్టించారని అన్నారు.
పోలీసుల అదుపులో డాక్యుమెంట్ రైటర్లు
గ్యాంగ్‌స్టర్ నరుూమోద్దీన్ భూ ఆక్రమణలకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించారన్న అనుమానంతో నల్లగొండ జిల్లా భువనగిరి, బీబీనగర్, యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను బుధవారం సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నరుూమోద్దీన్ అక్రమంగా ఆక్రమించుకున్న, భూయజమానులను బెదిరించి కొనుగోలు చేపట్టిన స్థిరాస్తులెన భూములు, గృహాలకు సంబందించిన వివరాలను తెలుసుకునేందుకు భువనగిరి, బీబీనగర్, యాదగిరిగుట్ట సబ్‌రిజిస్టార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్‌లు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు భోగట్టా.

చిత్రం.. ఫిర్యాదు చేస్తున్న నరుూమోద్దీన్ బాధితులు