రాష్ట్రీయం

కిటకిటలాడుతున్న ఘాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: కృష్ణాపుష్కరాల సందర్భంగా ప్రజల్లో ఉత్సాహం తాండవిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్నాన ఘట్టాల దగ్గర జనం రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని దాదాపు అన్ని స్నానపు ఘాట్ల వద్ద కూడా జనం రద్దీ అధికంగానే కొనసాగుతోంది. మొదటి రోజున ఏవిధంగా జనం కదిలి వచ్చారో..నేటికీ అంతే ఉత్సాహంగా కదిలి వస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని తంగిడి మొదలుకుని నల్లగొండ జిల్లాలోని మట్టపల్లి వరకు కూడా అన్ని ఘాట్లలో జనప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. అధికారికంగా అందిన సమాచారం ప్రకారం బుధవారం సాయంత్రం వరకు పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య దాదాపు 69 లక్షలకు చేరింది.
సరాసరిన రోజూ పదిలక్షల నుండి 12 లక్షల మంది స్నానం చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పూజల కోసం ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. భక్తులు ఇక్కట్లకు గురికాకుండా అవసరమైన పూజాసామాగ్రిని అందించే ఏర్పాట్లు చేశారు.
బ్రాహ్మణులను కూడా అవసరమైన మేరకు నియమించారు. భక్తులు తమ పితృదేవతలకు పిండప్రదానం చేసేందుకు బ్రాహ్మణులు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. తెలంగాణ అర్చక సమాఖ్య, తెలంగాణ బ్రాహ్మణ సంఘం తదితర బ్రాహ్మణ సంఘాలు పుష్కరాల్లో భక్తులకు సేవలు అందిస్తున్నాయి. ఒక్కో పుష్కర ఘాట్‌కు ఒక సీనియర్ అధికారిని ‘ప్రత్యేక అధికారి’గా నియమించడంతో వారు అదే ప్రాంతంలో క్యాంపు వేసి ఉంటున్నారు. . ప్రత్యేక అధికారి నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు తదితర అన్ని శాఖల సిబ్బంది పనిచేస్తున్నారు. భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించడంతో వౌలిక వసతులు సజావుగా సాగుతున్నాయి. ప్రధానంగా తాగునీరు, ఆహార వసతి, పారిశుద్ద్యం తదితర అంశాల్లో ప్రభుత్వం నియమించిన సిబ్బంది భక్తులకు నిరంతరం సేవలు అందిస్తున్నారు.

చిత్రం.. బుధవారం భక్తులతో సందడిగా నెలకొన్న మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు క్యాతూర్ ఘాట్