రాష్ట్రీయం

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: అసలే ఆర్ధిక లోటు, ఆపై రోజువారీ ఖర్చులు, అప్పుతీసుకోక తప్పని పరిస్థితి, వెరసి నవ్యాంధ్రప్రదేశ్ క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. 2016-17 ఆర్ధిక సంవత్సరం ఇంకా సగం కూడా గడవలేదు, ఎపి మాత్రం ఏకంగా ఆరోసారి రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. గడచిన నాలుగు నెలల్లో ఐదుసార్లు అప్పు తీసుకున్న ఎపి, తాజాగా ఆరో రుణం కోసం రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది. తాజా దరఖాస్తులో 400 కోట్ల రుణానికి అనుమతించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆర్‌బిఐకి విన్నవించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో భారీ ఆర్ధిక లోటు నేపథ్యంలో ఎపి అప్పుల బాట పట్టక తప్పలేదు. ఆర్థిక లోటు భర్తీకి సహకరిస్తామని చెప్పిన కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తున్న నేపథ్యంలో ఎపిలో అప్పులే దిక్కుగా మారాయి. ఇప్పటికే ఏపి ఐదువిడతల్లో ఇంత వరకూ 6050 కోట్లు అప్పు తీసుకుంది. తొలి మూడు విడతల్లో ఒక్కో మారు 1500 కోట్లు చొప్పున 4500 కోట్లు తీసుకోగా, నాలుగో విడతలో 800 కోట్లు, ఐదో విడతలో 750 కోట్లు సమీకరించింది. తాజాగా మరో 400 కోట్ల రుణానికి అనుమతించాలని ఎపి సర్కార్ చేసుకున్న దరఖాస్తుకు ఆర్‌బిఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే...ఎపి అప్పు 6450 కోట్లకు చేరనుంది.