రాష్ట్రీయం

వెల్‌కమ్ సింధు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియోలో భారత వెండి వేల్పుగా నీరాజనాలందుకున్న సింధూ సోమవారం హైదరాబాద్‌లో అడుగు పెడుతోంది. తెలుగుల కీర్తిని విశ్వవిఖ్యాతం చేసిన క్రీడాకారిణికి సగర్వంగా, సాదరంగా ఆహ్వానించేందుకు యావత్ ప్రజ ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమెను స్వాగతించటానికి అభిమానులంతా సమాయత్తమవుతున్నారు. అధికార యంత్రాంగమైతే ఆకాశమంత సంబరానికి సిద్ధపడిపోయింది. విశ్వక్రీడావేదికపై దేశానికి రజతాన్ని సాధించి పెట్టిన తొలి మహిళ కావటం..అదీ తెలుగమ్మాయి కావటంతోప్రభుత్వానికి, ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇవాళ దేశమంతటా సింధు పేరు మార్మోగిపోతోంది. తెలుగమ్మారుూ..తెలుగమ్మారుూ అంటూ ప్రతి లోగిలీ పలవరిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అందరి దృష్టీ క్రికెట్ బ్యాట్‌పై నుంచి షటిల్ రాకెట్ వైపు మళ్లుతోంది. ఇందరిని మెస్మరైజ్ చేసిన సింధూకు హైదరాబాద్ నగరం పూలబాట పరుస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజేంద్రనగర్, అత్తాపూర్, మొహిదీపట్నం, టోలీచౌక్‌ల మీదుగా గచ్చిబౌలీ స్టేడియం వరకూ అపూర్వమైన భారీ ఊరేగింపునకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరిగిపోయాయి. విమానాశ్రయం నుంచి సింధు ర్యాలీ సాగినంతమేర ఆకాశం నుంచి పుష్పవర్షం కురవనుంది. విమానాశ్రయంలో మంత్రి కె.తారకరామారావు ఆమెను ఆహ్వానించనున్నారు. మంత్రితో పాటుగా ఆమెకు ఘనస్వాగతం తెలిపేందుకు సన్నిహితులు, కుటుంబసభ్యులు విమానాశ్రయానికి వస్తారు. ఆమెతో పాటు ర్యాలీలో పాల్గొంటారు. ర్యాలీ వెళ్లే ప్రధాన కూడళ్లలో విద్యార్థులు, అభిమానులు సింధుకు జేజేలు పలకడానికి సిద్ధమవుతున్నారు. గచ్చిబౌలి స్టేడియంకు చేరుకున్న తరువాత సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనంగా పౌర సన్మానం చేస్తారు. తమ ప్రభుత్వం ప్రకటించిన నగదు పురస్కారాన్ని అందిస్తారు.