ఆంధ్రప్రదేశ్‌

ఐటితో సవాళ్లకు పరిష్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: ఏపిలో ప్రజల నిత్య సవాళ్లకు ఐటి పరిష్కారాలను చూపించడంలో యువత తమ ప్రతిభా పాటవాలను చాటుకుంటున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంశంపై వర్కుషాప్ నిర్వహించినపుడు అనేక మంది యువకులు నిత్యసమస్యలపై ఐటి ద్వారా తమ పరిష్కారాలను సూచించారు. రోజూ వినియోగించే అనేక అంశాలకు సంబంధించి సమూల మార్పులు ఏ విధంగా రాబోతున్నాయో కూడా వారు తమ పరిశోధనల ద్వారా వివరించారు. ఒకరు విద్యుత్ నష్టాలకు ఫుల్‌స్టాప్ పెట్టగా, మరొకరు దొంగతనాలను అరికట్టే విధానం, ఇంకొకరు ఆక్వా రైతుల కష్టాలకు ఫుల్‌స్టాప్ పెట్టే పరిశోధనల ఫలితాలను వివరించారు. వాతావరణంలో మార్పులు, భూసార పరీక్షలను కనుగొనడంపై మరో విద్యార్ధి వివరించారు. విజయ్ ఆదిత్య ఇటీవల పెరుగుతున్న విద్యుత్ పంపిణీ నష్టాలకు సంబంధించి తాను రూపొందించిన టెక్నాలజీని వివరించారు. తయారైన విద్యుత్ ఎంత మొత్తంలో వినియోగదారులకు చేరుతుందో, ఎంత మేర విద్యుత్ చౌర్యానికి గురవుతుందో కూడా చెప్పవచ్చని అన్నారు. మరో విద్యార్ధి సురేష్‌బాబు ఆక్వా రైతులకు పనికొచ్చే ఫలితాలను వివరించారు. ఒక్కసారిగా పిహెచ్ స్థాయి పెరిగిపోవడంతో రొయ్యలు చనిపోతున్నాయని, అలాంటపుడు రొయ్యలను కాపాడుకునేందుకు సెన్సార్లను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు.
ఎస్‌కె యూనివర్శిటీకి చెందిన దివ్యవాణి అనే విద్యార్థిని తమ పరిశోధనలకు సంబంధించి వైఫై రూటర్ల ద్వారా తయారుచేసిన సెన్సర్లతో భూసార పరీక్ష ఫలితాలు అధ్యయనం వివరించారు.