ఆంధ్రప్రదేశ్‌

తెలుగుపై నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 23: తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు. విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు సంస్కృతి గురించి తెలుసు కోవాలంటే భవిష్యత్‌లో మనం విదేశాలను ఆశ్రయించే పరిస్థితులు ఎదురయ్యే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరును విమర్శించట్లేదని, తెలుగు భాష, సంస్కృతి విషయంలో మాత్రమే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నానన్నారు. ఈ దేశంలో పుట్టి, ఫరిడవిల్లిన బౌద్ధమతం మాదిరి తెలుగు భాష, సంస్కృతి గురించి విదేశీయుల నుంచి తెలుసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో నెలకొల్పాలని తాను ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని గతేడాది ఆగస్టులో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని, ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4000 పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి, ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. విశాఖలో మహా కవి శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీశ్రీ) ఇంటిని మ్యూజియంగా మారుస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదన్నారు. ఘనత వహించిన మంత్రి కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా రకుల్ ప్రీత్ సింగ్ ఇంటికెళ్లి స్వయంగా ఆహ్వానం పలికారని, కళాకారిణుల పట్ల ఆయనకున్న అభిమానాన్ని తాను తప్పుపట్టనని, అయితే తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మాత్రం హర్షణీయం కాదన్నారు.
ప్రకాశం పంతులు జీవితం
అందరికీ ఆదర్శం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఆగస్టు 23:ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరు నడుచుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖమంత్రి రావెల కిశోర్‌బాబు పిలుపునిచ్చారు. టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతి సందర్భంగా మంగళవారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఆయన విగ్రహానికి మంత్రి రావెల, రాష్ట్రప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌రావు,రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి, జిల్లాకలెక్టర్ సుజాతశర్మ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన సమావేశంలో మంత్రి కిశోర్‌బాబు మాట్లాడుతూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జీవిత చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రకాశం పంతులు జీవితాన్ని నేటి యువతకు తెలియచేసేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రకాశం పంతులు జన్మస్ధలం వినోదరాయునిపాలెంలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు పరకాల ప్రభాకరరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రకాశం పంతులు జయంతిని రాష్టప్రండుగగా ప్రకటించటం ఆయన త్యాగానికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు అన్నారు. జిల్లాకలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు.