తెలంగాణ

ఆరోగ్యశ్రీకి ఫిక్కీ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్యశ్రీకి ప్రతిష్టాత్మకమైన ఫిక్కీ అవార్డు లభించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(్ఫక్కీ) హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డు 2016కు తెలంగాణ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఎంపికైంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రత్యేకంగా రూపొందించిన జిపిఎస్ మొబైల్ యాప్‌కి ఈ లెట్స్ స్మార్ట్ హెల్త్‌కేర్ అవార్డు లభించడం ఇది రెండవ సారి. గత ఎప్రిల్‌లో ప్రారంభించిన ఈ యాప్ ఐదులక్షల డౌన్‌లోడ్స్, ఐదు పాయింట్లకు 4.6 పాయింట్లను గూగుల్ ప్లే స్టోర్‌లో సాధించింది. ఆరోగ్యశ్రీ సేవల గురించి ఈ యాప్‌లో సంపూర్ణ సమాచారాన్ని పొందు పరిచారు. హాస్పిటల్‌కు సంబంధించి సేవలు, డాక్టర్ల వివరాలు, ఫోన్ నంబర్లు, ఆస్పత్రికి రూట్‌మ్యాప్‌తో సహా అన్ని విషయాలు పొందు పరిచారు. ఆత్యవసర సమయాన్ని కార్డు లేకపోయినా ఈ యాప్ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డును డౌన్‌లోడ్ చేసుకొని సేవలు పొందవచ్చు. త్వరలోనే ఈ యాప్‌కు మరింతగా మెరుగులు దిద్దనున్నట్టు తెలిపారు. ఈ యాప్‌ను ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు తమకు రూపొందించాలని అడుగుతున్నారు. ఉత్తరాఖండ్ ఇప్పటికే అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వానికి పంపింది. ఇతర రాష్ట్రాలు అడుగుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ యాప్‌ను దేశ వ్యాప్తంగా విస్తరించాలని ఆలోచిస్తోంది. ఈనెల 31న ఢిల్లీలో ఫిక్కీ అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందజేస్తారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా ఈ అవార్డును తెలంగాణ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఓ డాక్టర్ ఎం చంద్రశేఖర్‌కు అందజేస్తారు.