తెలంగాణ

మహిళ లోదుస్తుల్లో బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా సాగుతోన్న బంగారం స్మగ్లింగ్‌కు పోలీసులు అడ్డుకట్ట వేశారు. విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా దేశంలోకి వస్తున్న బంగారం స్మగ్లింగ్ రూటు మారింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నైలోని ఎయిర్‌పోర్టులోనే ఇప్పటి దాకా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ బంగారం పట్టుబడింది. ఈ రెండు విమానాశ్రయాల్లో తనిఖీలు ముమ్మరమైన నేపథ్యంలో స్మగ్లర్లు రూటు మార్చారు. హైదరాబాద్ బంగారం స్మగ్లర్లు దేశ రాజధాని ఢిల్లీని కేంద్రంగా ఎంచుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఈ బంగారాన్ని తరలించేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబాయి నుంచి ఓ హైదరాబాద్ మహిళ రెండు కిలోల బంగారు బిస్కెట్లతో పట్టుబడింది. ఆమె వేసుకున్న దుస్తుల్లో రెండు కిలోల బంగారం లభించడంతో అధికారులు ఖంగుతున్నారు. వీటి విలువ దాదాపు రూ. 64లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో బంగారంతో పట్టుబడిన మహిళ హైదరాబాద్ టోలిచౌకికి చెందిన ఫర్హత్ ఉన్నీసాగా గుర్తించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి బంగారంను తరలిస్తున్నారన్న విషయాన్ని నిగ్గుతేల్చేందుకు ఆమెను విచారిస్తున్నట్టు డిఆర్‌ఐ అధికారులు తెలిపారు.