తెలంగాణ

వంట మనిషి కాదు.. సోదరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. నరుూం ముఖ్య అనుచరురాలిగా అరెస్టయి, పోలీస్ కస్టడీలో విచారణలో ఉన్న ఫర్హాన్, స్వయాన నరుూం సోదరిగా సిట్ అధికారులు గుర్తించారు. నరుూం వంట మనిషిగా చెలామణి అవుతోన్న ఫర్హాన్ పేరిట కోట్లాది విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. నరుూం ఇంట్లో తొమ్మిది మంది గల్లంతైనట్టు ఫర్హాన్ సిట్ విచారణలో అంగీకరించింది. సోమవారం నస్రీన్ అస్తిపంజరంను కనుగొన్న పోలీసులు మరో నలుగురిని గుర్తించినట్టు సిట్ పేర్కొంది. అయితే ఆ నలుగురి మృతదేహాలు ఎక్కడ పాతి పెట్టారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఏడాది క్రితమే నస్రీన్‌ను నరుూం తన ఇంట్లోనే హత్య చేశాడని పోలీస్ కస్టడీలోని ఫర్హాన్ అంగీకరించింది. ఈ మేరకు ఆమె ఇచ్చిన సమాచారం మేరకు నస్రీన్ అస్తిపంజరంను నార్సింగ్ పరిధిలోని మంచిరేవులలో వెలికితీశారు. మంచిరేవుల శివారులోని ఓ చెట్ల పొదల్లో ఖననం చేసిన అస్తిపంజరాన్ని స్వాధీన పరుచుకున్న పోలీసులు హతురాలు నస్రీన్‌గా గుర్తించారు. మిగతా వారిలో నరుూం పెద్దమ్మ కూతురు ఫహీదా, మతీన్, మరో అనుచరుడు అలీం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నరుూం కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు 39 కేసులు నమోదు చేసి, 40 మందిని అరెస్టు చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. నరుూం ముఠా సభ్యుల్లోని కీలక వ్యక్తి శేషన్న దొరికితే అందరి సమాచారం బయటపడుతుందని సిట్ భావిస్తోంది. నరుూం అగడాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. సిట్ అధికారులకు కీలకమైన ఆధారాలు లభిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో పది మందిని సిట్ అరెస్టు చేసింది. భువనగిరిలో నలుగురిని, నల్గొండలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
నరుూంకు సినీ పరిశ్రమతోనూ లింకులు..
నరుూం వ్యాపారులనే కాదు..రాజకీయ నాయకులతోపాటు సినీ ప్రముఖులతో కూడా లింకులు ఏర్పరచుకున్నాడు. సినీ నిర్మాతలను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డాడు. ఓ నిర్మాతను బెదిరించి డబ్బులు వసూలు చేసినందుకు..ఆ నిర్మాత కొంతకాలం సినీ రంగానికే దూరంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సినీ నిర్మాత నట్టికుమార్ కూడా తానూ నరుూం బాధితుడినేనంటూ సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సినీ రంగానికి చెందిన ఐదుగురు ప్రముఖులను విచారించాలని కుమార్ డిమాండ్ చేశారు. నరుూం ఓ క్రైమ్ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే వహించినట్టు తెలుస్తోంది. సిట్ అధికారులు సినీ ప్రముఖులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు.