ఆంధ్రప్రదేశ్‌

ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న ఐదేళ్ల కాలంలో కనీసం 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా బృహత్ ప్రణాళికను రూపొందించింది. ప్రతి ఇంటి నుండి కనీసం ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తను తయారుచేయాలని, ఇందుకోసం రానున్న రోజుల్లో 41 విదేశీ వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించింది. దేశీయ కంపెనీలు, విదేశీ కంపెనీలు కలిపి మొత్తం 328 సంస్థలతో ఒప్పందాలు కదుర్చుకోవడం ద్వారా 4800 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా ప్రణాళిక రూపొందించింది. తద్వారా రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టవుతుంది. భారీ పరిశ్రమలు, ఇంధన రంగం, రిటైల్ , ఇన్‌ఫ్రా, మైనింగ్, ఆహారశుద్ధి, ఐటి, గృహనిర్మాణం, పర్యాటక రంగాల నుండి వివిధ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
మరో పక్క పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడం ద్వారా లక్షలాది ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా నూతన పర్యాటకరంగ విధానాన్ని ప్రారంభించింది. టూరిజంకు సంబంధించి వివిధ కంపెనీలతో నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కూడా చేసుకుంది. వీటి ద్వారా రాష్ట్ర యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ...ఐఒటి కంపెనీలకు రాష్ట్రప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ మేరకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీంతో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వంద కంపెనీలు రాష్ట్రంలో నెలకోల్పుతున్నారు. వీటి రాకతో మరో 50వేల ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు.
అనుబంధ రంగాల్లో 2 లక్షల ఉద్యోగాలు
ఇండో యుకె ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కింగ్స్ కాలేజీ...అమరావతిలో ప్రపంచస్థాయి ఆస్పత్రిని నిర్మించబోతోంది. వెయ్యి కోట్ల రూపాయిల పెట్టుబడితో 1100 పడకలతో అధునాతన సౌకర్యాలతో ఈ హాస్పిటల్ నిర్మించబోతున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలో మరో 10 హాస్పిటల్స్, కాలేజీలు నిర్మించబోతున్నారు. వీటన్నిటి కార్యకలాపాలు అమరావతి కేంద్రంగానే సాగుతున్నాయి. ఇదే జరిగితే వీటికి తోడుగా అనేక అనుబంధ రంగ పరిశ్రమలు కూడా నెలకోల్పాల్సి ఉంటుంది. ఈ పరిశ్రమలతో రెండు లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేశారు.
నైపుణ్యాభివృద్ధి శిక్షణ
యువతకు వెంటనే ఉద్యోగాలు రావాలంటే విద్యార్ధులకు నైపుణ్యాలు అందించే బాధ్యతను కూడా ప్రభుత్వమే భుజనా వేసుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా గత ఏడాది 90వేల మందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వగా, ఈ ఏడాది రెండున్నర లక్షల మందికి శిక్షణ ఇవ్వడానికి సిద్ధమైంది. త్వరలోనే నైపుణ్యాభివృద్ధి శిక్షణ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే డ్వాక్రా సంఘాల తరహాలోనే ఉపాధి కల్పించడమే ధ్యేయంగా యువజన సంఘాలను ఏర్పాటు చేయబోతోంది. జిల్లాకు వెయ్యి యూనిట్లు చొప్పున మంజూరు చేసి, ఒక్కో యూనిట్‌కు లక్ష రూపాయిల వరకూ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. శ్రీసిటీ పారిశ్రామికవాడ విజయవంతం కావడంతో విశాఖ -చెన్నై కారిడార్, చెన్నై-బెంగలూరు కారిడార్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.