ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 23: దేశంలో ఎప్పుడు ఎక్కడ ప్రమాదం సంభవించినా శివారుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు హాని జరుగుతునే ఉంది. గడచిన గోదావరి పుష్కరాలు తొలిరోజున అనేక మంది జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు దుర్మరణం పాలవ్వగా మరికొంతమంది క్షతగాత్రులుగా మిగిలిన విషయం తెలిసిందే. తాజాగా కృష్ణాపుష్కరాలు కూడా శ్రీకాకుళం జిల్లాను శోకసంద్రంలో ముంచాయి. మరికొద్ది గంటల్లో కృష్ణమ్మ పుష్కరాలకు ముగింపు పలకనున్న తరుణంలో జిల్లాలోని పొందూరు మండలం కింతలి-తోలాపి గ్రామాలకు చెందిన భక్తులు మంగళవారం రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. ఒకే కుటుంబంతోపాటు సమీప బంధువులను తీసుకొని సొంత వాహనంలో పుష్కరాలకు వెళ్తుండగా విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఆ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో పైడి వెంకటరమణ(45), సనపల హర్షవర్ధన్(10)లు మృత్యువాత పడ్డారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న పైడి భూలక్ష్మి, పైడి అప్పలస్వాములు మృతుల తల్లిదండ్రులు. భూలక్ష్మి కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దీంతో కింతలి-తోలాపి గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. అనేక సంఘటనలు సిక్కోలు వాసులను విషాదంలోకి నెట్టేసి ఆ కుటుంబాలకు శోకాన్ని మిగిల్చుతున్నాయి.
బ్యాంకు మాజీ కార్యదర్శి ఇంట్లో ఏసిబి సోదాలు
* రూ.80 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు
కాళ్ళ, ఆగస్టు 23: ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారనే అభియోగంపై పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక సహకార బ్యాంకు మాజీ కార్యదర్శి, అతని బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికార్లు మంగళవారం సోదాలు నిర్వహించారు. సుమారు రూ.80 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వివరాలిలావున్నాయి... జిల్లాలోని కాళ్ళ మండలం కోపల్లె సహకార బ్యాంకు కార్యదర్శిగా పనిచేసిన మంతెన సూర్యనారాయణ రాజు ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణచేశారు. మండలంలోని జక్కరం గ్రామంలో నివాసం ఉంటున్న సూర్యనారాయణ రాజు ఇంటిపై మంగళవారం ఉదయం ఎసిబి అధికార్లు దాడిచేశారు. అలాగే భీమవరంలో నివాసం ఉంటున్న ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లు, ఆయన వ్యాపార భాగస్వామి ఒకరి ఇంటితో సహా మొత్తం ఐదుచోట్ల ఏకకాలంలో దాడిచేసి, సోదాలు నిర్వహించారు. సూర్యనారాయణరాజు ఇంట్లో రూ.2.5 లక్షల నగదు, కిలో బంగారం, 300గ్రాముల వెండి, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. జక్కరంలో 12 ఎకరాల భూమి, కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో 16 ఎకరాల భూమిని కనుగొన్నారు. కాళ్ళ మండలంలో 90 ఎకరాల భూమిని లీజుకు చేస్తున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో భీమవరంలోని ఆయన బంధువుల ఇళ్ళల్లో కూడా ఏకకాలంలో సోదాలు చేశారు. కొడుకు మంతెన వెంకటరామరాజు, అల్లుడు పిహెచ్ రామరాజు, వ్యాపార భాగస్వామి బంగారాజు ఇళ్లతోపాటు, కోపల్లె బ్యాంకులో కూడా సోదాలు జరిపారు.
26న బంగాళాఖాతంలో అల్పపీడనం?
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 23: ఎండల ప్రభావంతో అల్లాడుతున్న కోస్తాంధ్ర ప్రజలకు మరికొద్ది రోజుల్లో భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం లభించనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడవచ్చని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడటంతో కనీసం మూడు రోజులైన కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురియవచ్చని భావిస్తున్నారు. కాగా, విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి మంగళవారం ఏర్పడింది. దీని ఫలితంగా రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి వెల్లడించారు.