ఆంధ్రప్రదేశ్‌

విద్యకు పెద్దపీట మంత్రి గంటా శ్రీనివాసరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, ఆగస్టు 23: రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని టౌన్ హాలులో కాకినాడ జెఎన్‌టియుకు అనుబంధంగా నరసరావుపేటలో ఏర్పాటుచేసిన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ కెవిఎస్‌జి మురళీకృష్ణ సభకు అధ్యక్షత వహించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో ఎకో సిస్టమ్‌లో జెఎన్‌టియు స్థాయికి తగ్గకుండా రాష్ట్రానికి ఒక మోడల్ ఇన్‌స్టిట్యూట్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నామన్నారు. బడ్జెట్‌లో విద్య కోసం 21 వేల కోట్లు కేటాయించామన్నారు. ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రవేశ పరీక్షలన్నీ ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యలో నాణ్యత తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ చాన్సలర్లను ప్రతి మూడు నెలలకు ఒక సమావేశంలో చర్చించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని యూనివర్సిటీలలో వైఫే సౌకర్యం, డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఫీజు రీయింబర్సుమెంటు దుర్వినియోగం కాకుండా కేజీ - పిజి చదువుల్లో ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేయనున్నామన్నారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటలో ఏర్పాటుచేయడం వల్ల ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు జరిగితే నరసరావుపేట ఒక జిల్లాగా ఏర్పడుతుందన్నారు. నరసరావుపేటలో నాలుగు శతాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. జెఎన్‌టియు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన సహకారం మరువ లేనిదన్నారు. కళాశాల ఏర్పాటుకు బీజం వేసింది మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జెఎన్‌టియు ఏర్పాటు కోసం గతంలో మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి విన్నవించానని చెప్పారు. కళాశాల ఏర్పాటుకు మాజీ మంత్రి కాసు చేసిన కృషిని కొనియాడారు. కళాశాల వైస్ చాన్సలర్ విఎస్‌ఎస్‌ఎస్ కుమార్, రిజిష్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ సాయిబాబు, రెక్టార్ డి ప్రభాకరరావు, ఇసి మెంబర్లు స్వర్ణకుమార్, కామరాజు, డాక్టర్ వెంకట్రావ్, ఎంపి అవంతి శ్రీనివాస్, మునిసిపల్ ఛైర్మన్ సుబ్బరాయ గుప్త, ఆర్‌డిఒ రవిందర్ పాల్గొన్నారు.