ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్‌లో కొలిక్కిరానున్న ఎపి టెలికాం సర్కిల్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 23: రాష్ట్ర విభజన తర్వాత ఎపి టెలికాం సర్కిల్ విభజన ప్రక్రియ అక్టోబర్ నాటికి పూర్తి కానుంది. అక్టోబర్ నుంచి విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పని చేయనుంది. ఈ విషయాన్ని బిఎస్‌ఎన్‌ఎల్ విశాఖ జిల్లా సీనియర్ జనరల్ మేనేజర్ నళినీ వర్మ వెల్లడించారు. ఈ మేరకు ఆమె మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ రెండేళ్ళుగా హైదరాబాద్ కేంద్రంగా ఎపి టెలికాం సర్కిల్ పనిచేస్తోంది. విభజన ప్రక్రియ ఇటీవల ప్రారంభించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో విజయవాడ నుంచి ఈ సర్కిల్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. 4జి సర్వీసులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ జరుగుతోందని ఆమె తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, అయితే విశాఖలో ఈ సర్వీసుల ప్రారంభంపై నిర్ణయం తీసుకోలేదని, డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రాంతాలను మాత్రం గుర్తించనున్నట్టు వెల్లడించారు. తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్న ఫైబర్ గ్రిడ్ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇన్‌స్టలేషన్ చార్జీలు తక్కువగా ఉంటాయని గుర్తు చేశారు. 3జి సర్వీసుల కనెక్టవీటిపై ఫిర్యాదులపై చర్యలు వెంటనే తీసుకుంటున్నామన్నారు.