ఆంధ్రప్రదేశ్‌

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం/ మైలవఠం, ఆగస్టు 23: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద సదస్సు వేదికపై మంగళవారం ఉదయం ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్-(ఐఒటి)’పై ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఆయన ప్రసంగించారు. పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించటం, ఇ-పోస్, ఇ-గవర్నెన్స్, సీఎం కోర్ డ్యాష్‌బోర్డ్, తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రపంచం మొత్తంలో ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ జరుగుతోందని, దీనివల్ల ఏదైనా రియల్ టైమ్‌లో సేవలందించటానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇన్నోవేషన్ సొసైటీల ఏర్పాటు, విద్యావిధానాన్ని ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను సామాన్యులు కూడా ఎక్కడైనా ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం కల్పించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విభజన తర్వాత ఎన్నో సమస్యలు మీదపడ్డా వినూత్నంగా ఆలోచించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. గోదావరి పుష్కరాల అనుభవంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఏ చిన్న ఇబ్బందీ కలగకుండా ఐఓటి టెక్నాలజీ ద్వారా సంతృప్తికరమైన సేవలు అందించామని చెప్పారు. అందరిలో చైతన్యం తేవటంతో పాటు పూర్తి సంతృప్తినిచ్చామన్నారు. రాష్ట్రంలో సీఎం డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేయటంతో పాటు ఇ-ప్రగతిని తీసుకొచ్చి అన్నిటినీ ఆన్‌లైన్ చేశామన్నారు. రాష్ట్రంలో వర్షాభావం, భూగర్భ జలాలు, ఉష్ణోగ్రతలు, కాలుష్యం పరిస్థితిపై కూడా వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టామన్నారు. ఇ-పోస్ ద్వారా రేషన్ షాపుల్లో అవినీతిని పూర్తిగా అరికట్టామని, సెల్‌ట్యాబ్ ద్వారా ఫించన్లు అర్హులైన వారికి స్వయంగా ఇంటికెళ్లి అందిస్తున్నామన్నారు. టెక్నాలజీ ద్వారా వసతులు, సేవలను అందుబాటులోకి తేవటమే కాకుండా నేరాలను అరికట్టగలిగామన్నారు. భవిష్యత్తులో రౌడీషీటర్లు రోడ్లపై తిరగాలంటే సిసి కెమెరాలు వారిని వెంటాడతాయన్నారు. డిఎన్‌ఎ టెక్నాలజీని అందుబాటులోకి తేవటం వల్ల నేరప్రదేశంలో ఎలాంటి చిన్న ఆధారం దొరికినా నేరస్తులు తప్పించుకోలేరన్నారు. అదేవిధంగా కెమెరాలు పెట్టలేని ప్రాంతంలో డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించవచ్చన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ మీడియాకి ఓబి వ్యాన్ అవసరం లేకుండా, మీడియాకు ఆన్‌లైన్ ద్వారా లైవ్ కార్యక్రమాలు అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వాననీటిని భూగర్భ జలాలుగా నిల్వ చేయటానికి అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. గోదావరి - కృష్ణా నదుల అనుసంధానం మాదిరిగానే రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానించి మంచినీరు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. రెయిన్ గన్‌లను అందుబాటులోకి తెచ్చామన్నారు.