ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో కలశాభిషేకం, పుష్పయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 23 : కృష్ణా పుష్కరోత్సవాలు మంగళవారం నాటితో ముగిశాయి. గత 12 రోజులుగా కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, సంగమేశ్వరంతో పాటు నెహ్రూనగర్, ముచ్చుమర్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌లలో మొత్తం 14.81 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే లక్షలాది మంది పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. పుష్కరోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీశైలంలో 1,116 మంది దంపతులతో పాతాళగంగ నుంచి పవిత్ర పుష్కర జలాలను కళశాలలో తీసుకొచ్చి మల్లికార్జున స్వామివారికి అభిషేకం చేశారు. ఆ తరువాత పుష్పయాగంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. సంగమేశ్వరంలో శ్రీలలితా సంగమేశ్వరులకు హవభృతస్నానం, బృహస్పతి, గాయత్రి యాగం, పూర్ణాహుతి, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించి పుష్కరోత్సవాలకు ముగింపు పలికారు. ముచ్చుమర్రిలో 108 మంది మహిళలతో సాయంత్రం నదీమతల్లికి పుణ్యహారతి ఇచ్చి పుష్కరుడికి వీడ్కోలు పలికారు. నెహ్రూనగరంలో వేద పండితులు కృష్ణా నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి చీరె, సారె సమర్పించి ముగించారు. పుష్కరాల చివరి రోజైన మంగళవారం జిల్లాలో 1.73లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. శ్రీశైలంలో సుమారు 1.2 లక్షలు, సంగమేశ్వరంలో 28 వేలు, ముచ్చుమర్రి, నెహ్రూనగర ఘాట్‌లలో 20 వేల మంది పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు తేల్చారు. గత 12రోజుల్లో 10వ రోజైన 21వ తేదీన ఏకంగా 2.83లక్షల మంది పుష్కర స్నానాలు చేయగా, అతి తక్కువగా మొదటి రోజైన 12వ తేదీన కేవలం 42వేల మంది మాత్రమే పుణ్యస్నానాల్లో పాల్గొన్నారు. అధికార యంత్రాంగం జిల్లాలో ఏ చిన్న సంఘటనకూ ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. పుష్కరాలు నిర్వహించిన మూడు జిల్లాల్లో కర్నూలు మొదటి స్థానంలో నిలవగా స్నానపు ఘాట్‌లలో సంగమేశ్వరం మొదటి స్థానంలో ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు భక్తులకు సేవలందించేందుకు తరలి వచ్చిన స్వచ్ఛంద సేవకులు నిస్వార్థంగా అంకితభావంతో పనిచేసి భక్తులకు సేవలందించారు. పోలీసులు శాంతి భద్రతలతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సమన్వయంతో పనిచేసి భక్తులు తిరిగి గమ్యస్థానాలు చేరుకునేందుకు తోడ్పాటు అందించారు. అయితే శ్రీశైలంలో పుష్కర విధులకు వచ్చిన కర్నూలు 3వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ గోపాలకృష్ణ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరం. ఈ చిన్న సంఘటన మినహా పుష్కర ఉత్సవాలు ఘనంగా, శాంతియుతంగా ముగిశాయి.