ఆంధ్రప్రదేశ్‌

పుష్కరం..దిగ్విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: గోదావరి పుష్కరాల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో వుంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిష్టాకరంగా భావించిన కృష్ణా పుష్కరాలు విజయవంతంగా ముగిసాయి. అయితే చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. దాదాపు రెండువేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి మొత్తం 170 పుష్కర ఘాట్లకు అన్ని వైపుల నుంచి రహదారులను అనుసంధానం చేసినందులకు కనీసం మూడున్నర కోట్ల మంది యాత్రికులు పుష్కర స్నానం చేయగలరని ప్రభుత్వం అంచనా వేసింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఏనాడు కూడా రెండు కోట్ల మంది దాటనప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా జరిగిన ఈ పుష్కరాల్లో ఆఖరి రోజు నాటికి రెండు కోట్ల మంది దాటగల్గారు. ఒక్క విజయవాడ నగరంలోనే 80 లక్షల మంది, కృష్ణాజిల్లాలో ఇతర ప్రాంతాల్లో 33లక్షలు, కర్నూలు జిల్లాలో 15లక్షలు, గుంటూరు జిల్లాలో 70లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. అయినా రాష్ట్రంలో ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ పుష్కర సంబరాలు ఇంటింటా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి మన సంస్కృతీ సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాయి. స్నానఘట్టాల వద్ద శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటైన సౌకర్యాలను చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకా వేలాది మంది యాత్రికులు స్నానమాచరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గోదావరి పుష్కరాల్లో ఎదురైన చేదు అనుభవాలతో సిఎం చంద్రబాబునాయుడు ఆరంభం నుంచి ముగిసే వరకు నగరంలోనే మకాం చేయటమే గాక పవిత్ర సంగమంలో రాత్రి 7 గంటలకు జరిగే పవిత్ర హారతికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ పుష్కరాలు విజయవంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవింపచేసారు. ఏ ఒక్కరూ విధి నిర్వహణలో ఇబ్బంది పడకుండా పటిష్టమైన సేవలందించారు. ఇక డిజిపి నండూరి సాంబశివరావు ఓవైపు ఆర్టీసీ ఎండి హోదాలో ఏ ఒక్కరికీ అసౌకర్యం లేకుండా ఆర్టీసీ బస్సులను నేరుగా స్నానఘట్టాల వద్దకే చేర్చారు. 2 లక్షల 70వేల ట్రిప్‌లతో దాదాపు ఒక కోటీ 40 లక్షల మంది యాత్రికులను వివిధ ప్రాంతాల నుంచి రైల్వే, బస్‌స్టేషన్లు, పుష్కరనగర్‌లు, స్నానఘట్టాలకు అలాగే అక్కడ నుంచి వారి వారి గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సృష్టించారు. ఏ ఒక్క బస్సులో కూడా తొక్కిసలాట కన్పించలేదు. ఇక మరోవైపు డిజిపి హోదాలో.. ఈ 12 రోజుల్లో అన్నిదారులు కృష్ణమ్మవైపే ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్ నియంత్రణలో కృతకృత్యులయ్యారు. ఇక ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసేలా సమాచారశాఖ విస్తృతమైన ప్రచార కార్యక్రమాలను పటిష్టవంతంగా అమలుచేయగల్గి తప్పిపోయిన వారిని నిమిషాల వ్యవధిలో కుటుంబ సభ్యులకు అప్పగించడం ఓ రికార్డు. ఒక్క కృష్ణాజిల్లాలోనే రెండు లక్షల మంది పిల్లల చేతులకు ట్యాగింగ్ వేసి తప్పిపోయిన 40 మందిని సునాయాసంగా గుర్తించగల్గారు. ఇక వేర్వేరు ఘటనల్లో మూడు జిల్లాల్లో 25 మంది మృతి చెందారు. నందిగామకు చెందిన ఐదుగురు విద్యార్థుల మృతి దురదృష్టకర ఘటన.. ఇక అత్యధిక మంది గుండెపోటుతో మరణిస్తే తొలిరోజున విజయవాడలో ఏడేళ్ల బాలుడు నీటిలో మునిగి మరణిస్తే బట్టలు ఉతుక్కోటానికి విటిపిఎస్ కాలువకు వెళ్లి అందులోపడి తల్లీకూతుళ్లు మరణించారు. చివరిరోజున పుష్కరస్నానం చేసి తిరిగి వెళ్లే సమయంలో కారు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించారు. కృష్ణాలో 16 మంది గుంటూరు జిల్లాలో ఏడుగురు, కర్నూలు జిల్లాలో ఓ కానిస్టేబుల్ మరణించారు.

విజయవాడ కృష్ణవేణి ఘాట్‌లో జల్లు స్నానం
ముగింపు రోజు కర్నూలు జిల్లా సంగమేశ్వరం ఘాట్‌లో భక్తుల సందడి