ఆంధ్రప్రదేశ్‌

ఆలయాల అభివృద్ధికి సంక్షేమనిధి ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 24: పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడానికి ఒక సంక్షేమ నిధి ఏర్పాటుచేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమటీ చైర్మన్ బి. రాజేంద్రనాథ్ టిటిడి అధికారులకు సూచించారు. జిల్లాలో మూడురోజుల పర్యటన నిమిత్తం తిరుపతి వచ్చిన కమిటీ రెండోరోజైన బుధవారం తిరుపతి పద్మావతి అతిథిభవనంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పురాతన మైన ఆలయాలున్నాయని, అతి పెద్ద ధార్మిక సంస్థైన టిటిడి ఈ ఆలయాలను దత్తత తీసుకుని అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు.
దేవాలయాల అభివృద్ధికి సంక్షేమ నిధిని ఏర్పాటుచేసుకోవాలని సలహా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో హిందూత్వంపై విస్తృత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అక్కడ ఆలయ నిర్మాణాలు, విగ్రహాలను ఉచితంగా చేపట్టే కార్యక్రమాలను ముమ్మరంచేయాలన్నారు. ఎస్వీ భక్తి ఛానల్ ద్వారా హిందూ ప్రచారంపై మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈసందర్భంగా ఇ ఓ సాంబశివరావు మాట్లాడుతూ హిందూత్వ వ్యాప్తికి గిరిజన కాలనీలు, మత్స్య కార్మికుల కాలనీల్లో కూడా ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాంతాలలో 500 ఆలయాలు నిర్మించడానికి ఈ ఆర్థిక సంవత్సరానికి 40 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటుచేశామన్నారు. అడిగిన వారికి ఉచిత విగ్రహాలను అందజేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో టిటిడి నిర్వహించిన ధర్మప్రచార కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను టిటిడి అధికారులు కమిటీ ముందు ప్రదర్శించారు. ఈకార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఎ.సురేష్, పి.విష్ణుకుమార్ రాజ్,దాడి చెట్టి రామలింగేశ్వరరావు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డ్భిస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బి.చంగల్రాయులు, జె ఇ ఓలు పోలాభాస్కర్, శ్రీనివాసరాజు, ఆల్ ప్రాజెక్ట్ సంచాలకులు ముక్తేశ్వరరావు, మునిసిపల్ కమిషనర్ వినయ్‌చంద్, తుడా కార్యదర్శి మాధవీలత, కమిటీ అధికారులు పివి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.