ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్‌లో జాతీయ టిటి టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 24: జాతీయ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌ను విశాఖలో నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 19 నుంచి 25 వరకూ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి టోర్నమెంట్ లోగోను విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) కార్యాలయంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ దేశంలోని 29 రాష్ట్రాల నుంచి 700 క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఇందులో రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు షరత్ కమల్, సౌమ్యజిత ఘోష్, మనిక బాత్రా, వౌర్ణదాస్ కూడా పాల్గొంటారని వెల్లడించారు. వివిధ క్రీడలకు సంబంధించి ర్యాంకింగ్ టోర్నమెంట్‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఫిజికల్ లిటరసీలో భాగంగా గుంటూరులో పిఇటిలకు మాస్టర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించామని, వీరు వివిధ పాఠశాలల్లోని పిఇటిలకు శిక్షణ ఇస్తారని తెలిపారు. త్వరలోనే క్రీడలకు సంబంధించి ఒక విధానాన్ని రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, వుడా వీసీ బాబూరావు నాయుడు, విడిటిటిఎ కార్యదర్శి డివిఎస్‌వై శర్మ తదితరులు పాల్గొన్నారు.

టోర్నమెంట్ లోగో ఆవిష్కరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు