ఆంధ్రప్రదేశ్‌

సందడి తగ్గిన కృష్ణాతీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 24: కృష్ణా పుష్కరాలు ముగియటంతోనే రాష్ట్ర రాజధాని విజయవాడలో పుష్కర శోభ కళతప్పింది. 12 రోజులపాటు రాత్రి పగలు తేడా లేకుండా పుష్కర యాత్రికులతో కళకళలాడుతూ కన్పించిన స్నానఘట్టాలు వెలవెలపోతూ కన్పించాయి. కొన్ని ఘాట్లలో కనీసం ఒక్క మనిషి కూడా కన్పించలేదు. గతంలో కవర్లు, చెత్త కాగితాలు ఏరుకోటానికి వందలాది మంది పోటీ బడుతూ బారులు దీరేవారు. అయితే తొలిసారిగా పారిశుద్ధ్య సిబ్బంది క్షణక్షణం స్నానఘట్టాలతో పాటు పరిసరాలను శుభ్రం చేస్తూ అద్దంలా తీర్చిదిద్దటం జరిగింది. ఎక్కడైనా మజ్జిగ లేదా మంచినీటి కవరు, కనీసం చిన్న కాగితం కన్పించినా తక్షణమే తొలగిస్తూ రావటంతో ఇపుడు ఏరుకోటానికి కూడా ఏమీ కన్పిచకపోవటంవలననే ఎవరూ కూడా అటువైపు కనె్నత్తి చూడటటం లేదు. అయితే జనసంచారం లేకపోవటంతో కొందరు అత్యాశతో బాటుగా మాటుగా ఘాట్లలో అమర్చబడిన టైల్స్‌ను గోతాల్లో పెట్టుకొని ఎత్తుకువెళ్లారు. మరోవైపుస్నానఘట్టాల వద్ద ఏర్పాటైన ఐరన్ బారికేడ్లను విద్యుత్ దీపాలను సాయంత్రానికి పూర్తిగా తొలగించారు. కాగా సాయంత్రం నగరవాసులు కొందరు పిల్లా పాపలు వచ్చి స్నానాలు చేశారు. అలాగే వివిధ జిల్లాలనుంచి డ్యూటీ కోసం వచ్చిన పారిశుద్ధ్య సిబ్బంది కాంట్రాక్టర్ల నుంచి తమకు రావాల్సిన కిరాయి కోసం నగరంలో ఉండిపోవాల్సి రావటంతో వారంతా వివిధ ఘాట్లలో ఉత్సాహంగా, కాలక్షేపంగా స్నానాలు చేయటం కన్పించింది. అయితే తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు రైల్వే, బస్టేషన్ పరిసర ప్రాంతాలు, వాటికి అనుసంధానమైన రహదారులు రద్దీగానే కన్పించాయి. పుష్కర స్నానాల కోసం నగరంలోని బంధుమిత్రుల ఇళ్లకు వచ్చిన వారు నేడు తిరుగు ప్రయాణం కట్టడం వలన ఈ రద్దీ కన్పించింది. పుష్కరాల సందర్భంగా గత 12 రోజులు పుష్కర ఘాట్లతో పాటు ప్రధాన రహదారులన్నీ రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో కూడిన ఆధునిక లైటింగ్ విధానం, పుష్కర శోభ పెళ్లి వాతావరణాన్ని సంతరించుకునేలా చేసి ప్రజలను ఎంతగానో ఆకర్షిటంచాయి. అన్నింటి మించి స్వరాజ్య మైదానంలో కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటైన తిరుపతి శ్రీవారి నమూనా దేవాలయం ప్రజల్లో భక్త్భివాన్ని పెంపొందించడం, అలాగే ఆధ్యాత్మిక చింతన కల్పించేలా కళా ప్రదర్శనలు, ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వకాలపు ఆభరణాలు, ఇతర వస్తువులు భక్తులకు తెలిసేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక పవిత్ర సంగమం వద్ద నిత్యం రాత్రి ఏడు గంటల ప్రాంతాల్లో కృష్ణమ్మకు భక్తి శ్రద్ధలతో ఇచ్చే హారతి ఎంతగానో ఆకుట్టుకుంది.

నిర్మానుష్యంగా మారిన విజయవాడ పుష్కర ఘాట్లు .... మిగిలిపోయిన వాటర్ ప్యాకెట్ సంచులను తీసుకెళుతున్న స్థానికులు