తెలంగాణ

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం/చింతూరు, ఆగస్టు 24: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా డోర్నపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కెర్లపాల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశం అయ్యారని, వారు పోలీస్‌స్టేషన్‌పై దాడికి సిద్ధపడుతున్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దక్షిణబస్తర్ ప్రాంతానికి చెందిన మావోయిస్టులు దాడుల్లో పాల్గొంటున్నారని తెలిసి భద్రతాబలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరిగాయి.
కాల్పులు జరుపుకుంటూ మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. కాల్పుల్లో పూనెం పొడియా అనే మావోయిస్టు మరణించాడు. ఇతను ఆర్పీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇన్‌ఫార్మర్ల పేరిట పలువురు గ్రామస్తులను ఇతను చంపాడు. సంసట్టి, వాగ్డేయ్, పొంగిబెజ్జి, గంధపాల్ తదితర గ్రామాల్లో ఇతను అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. పోలీసులపై దాడులతో పాటు అనేక అంబుష్‌ల్లో ఇతను పాల్గొన్నాడని సుక్మా ఎస్పీ కల్యాణ్ ఎలిశెల తెలిపారు. కాగా ఆంధ్రా-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అల్లిగూడెం అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకోగా భారీ సంఖ్యలో నిత్యావసర వస్తువులు, ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.