ఆంధ్రప్రదేశ్‌

నెలరోజుల్లో అసెంబ్లీ భవన నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 24: ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలోనే 2 లక్షల చదరపు మీటర్లలో శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణాన్ని ఎల్ అండ్ టి సంస్థ చేపట్టింది. జీ + 1 కింద అసెంబ్లీ, విధానసభ భవనాలను లక్ష చదరపు అడుగుల్లో చేపట్టిన నిర్మాణాన్ని వచ్చే నెల 22వ తేదీ లోగా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్ అండ్ టి సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ఇదిలా ఉండగా పుష్కరాల నేపథ్యంలో సచివాలయానికి ప్రభుత్వ శాఖల తరలింపు విషయంలో అంతరాయం ఏర్పడింది. నెలాఖరులోపు ఎట్టి పరిస్థితిలో కీలకమైన శాఖలన్నింటినీ తరలించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి చాంబర్లతోపాటు కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. 27న వ్యవసాయ, అటవీ శాఖలను తరలించనున్నారు. 3వ బ్లాక్‌లోని మొదటి అంతస్తు, ముఖ్యమంత్రి, ప్రభుత్వ కార్యదర్శికి కేటాయించిన ఒకటో బ్లాక్ మొదటి అంతస్తు మినహా మిగిలిన భవనాలన్నీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఇంటీరియర్ డెకరేషన్, కంప్యూటర్, విద్యుత్ కెబుళ్లను కూడా ఏర్పాటు చేసినట్లు సిఆర్‌డిఎ అదనపు కమిషనర్ మల్లికార్జునరావు ఆంధ్రభూమికి తెలిపారు. సిఎం చాంబర్‌ను కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతోపాటు విదేశీ ప్రక్రియతో హంగులు దిద్దుతున్నారు. ఫ్లోరింగ్‌తోపాటు రూఫ్‌నూ బుల్లెట్ రూఫ్‌గా మార్పులు చేస్తున్నారు. ఈ భవనాన్ని షాపోర్‌జీ పల్లోంజి సంస్థ నిర్మిస్తున్నది. ముందుగా ఒకే రకమైన డిజైన్‌లు రూపొందించటంతో సాదాసీదాగానే సిఎం భవనాల నిర్మాణం జరిగింది. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం మార్పులు చేస్తున్నారు. మంత్రుల పేషీలుకూడా ఇరుకుగా ఉన్నందున 200 చదరపు మీటర్ల పరిధిలో పేషీలు ఉండేలా పునర్నిర్మాణం చేస్తున్నారు. సచివాలయానికి ప్రహరీ నిర్మాణం కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. శాసనసభలో సిఎం, స్పీకర్ల చాంబర్లతోపాటు లాబీ, గ్యాలరీలలో ఎలాం టి వాస్తుదోషం లేకుండా నిర్మాణాలు జరుపుతున్నారు.