ఆంధ్రప్రదేశ్‌

వెనుకబడిన తరగతులకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 24: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకంలో వెనుకబడిన తరగతులకు చెందిన న్యాయమూర్తులకు ధర్మం జరగడం లేదని తిరుపతి మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్ అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ సువిశాల భారతావనిలో వెనుకబడిన కులాలకు చెందిన వారిలో చాలామంది న్యాయమూర్తులు ఉన్నప్పటికీ ఇటు సుప్రీంకోర్టులో గానీ, అటు హైకోర్టులో గానీ న్యాయమూర్తి స్థానంలో ఒక్కరు కూడా నియమితులుకాకపోవడం బాధాకరమన్నారు. దేశ జనాభాను ప్రాతిపదికగా తీసుకొని న్యాయమూర్తుల నియామకం ఉంటే బాగుంటుందన్నారు. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న వెనుకబడినవర్గాలకు చెందిన న్యాయమూర్తులను సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించమని కోరుతూ తాను భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తారన్నారు. ఈక్రమంలో రాష్టప్రతిని కూడా కలుస్తానని ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదిలావుండగా ఈ అంశం పార్టీకి సంబంధం లేదని, పూర్తిగా నా వ్యక్తిగతమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ‘పవర్ ఫర్ ఎవర్’ అధికారం పూర్తిగా తమదే అన్నట్లుగా కొంత మంది కోర్టులను కబళించివేశారన్నారు. అందుకే వెనుకబడిన తరగతులకు న్యాయం జరగడంలేదన్నారు. న్యాయవ్యవస్థలో ప్రక్షాళన అవసరమని తాను అభిప్రాయపడుతున్నానన్నారు. న్యాయమూర్తుల నియామకంలో రిజర్వేషన్‌కావాలని కోరుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వెనుకబడిన తరగతికి చెందిన న్యాయమూర్తులకు మాత్రం న్యాయం జరగడం లేదన్నదే తన ఆవేదన అన్నారు.