ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ ఐదు రోజులేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: కృష్ణా పుష్కరాలను 12 రోజులపాటు అట్టహాసంగా జరిపి ప్రతి కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలను కేవలం ఐదు రోజులపాటే ఉంటాయని ప్రతిపాదించడంపై వైకాపా మండిపడింది. బుధవారం విలేఖర్ల సమావేశంలో వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం ప్రజల పాలిట కేన్సర్‌లా తయారైందన్నారు. ప్రచారం ఆర్భాటం, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప రాష్ట్భ్రావృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు.
రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయని, కరవు విలయతాండవం చేస్తుంటే పట్టించుకునే మంత్రులు లేరన్నారు. అసెంబ్లీలో చర్చించేందుకు చాలా సమస్యలున్నాయని, రాజధాని నిర్మాణం నుంచి పట్టిసీమ లిఫ్ట్ స్కీం వరకు ఎన్నో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. మేధాపట్కర్, స్వామినాథన్, అన్నాహజారా లాంటి గొప్పవారిని ఆహ్వానించి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం జరగడం లేదని, మద్యంతో అనుసంధానం చేస్తున్నారని అన్నారు. ఆగస్టునెలలో వర్షాలు లేక రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ప్రాంతాలు తీవ్రమైన కరవు పరిస్థితులను ఎదుర్కొంటుంటే, దీని గురించి పట్టించుకోవడం లేదన్నారు. కృష్ణానదిపై తెలంగాణ ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, నిలదీసే శక్తిని చంద్రబాబు కోల్పోయారని అన్నారు. చివరకు స్వశక్తితో ప్రపంచ విజేతగా నిలిచిన క్రీడాకారిణి సింధును కూడా అడ్డం పెట్టుకుని తన ప్రభుత్వాన్ని మార్కెటింగ్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించడం విచారకరమన్నారు. పవిత్రసంగమం వద్ద పుష్కరాల చివరిరోజు చంద్రబాబు ఉపన్యాసంతో జనాన్ని హడలు గొట్టారని, జిడిపి రేటు పెంచాలని సంకల్పం చేయించడం దారుణమని అన్నారు.
పుష్కరాల్లో ప్రజలను పీడించిన చంద్రబాబు
పుష్కరాలు జరిగిన 12 రోజులు ప్రజలను చంద్రబాబు పట్టి పీడించారని, ఉపన్యాసాలతో భక్తులను చిత్రహింసకు గురిచేశారని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. కృష్ణా పుష్కరాలు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్ర నాలుగు రాష్ట్రాల్లో జరిగాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రెండురాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన పూర్తిగా జరగలేదని, పరిపాలనపరమపైన సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు చంద్రబాబు చర్యలు తీసుకోకుండా సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. పుష్కరాలకు ముందు విజయవాడలో దేవాలయాలను విధ్వంసం చేశారని, ఘాట్‌లకు పచ్చరంగు వేయించారన్నారు. పుష్కరాలకు జనం వస్తే గేట్లువేసి వారిని వెళ్లనివ్వకుండా అనవసర ప్రసంగాలు చేశారని ఆయన దుయ్యబట్టారు.

మహిళా పార్లమెంటేరియన్ల
తొలి సభలు అమరావతిలో

హైదరాబాద్, ఆగస్టు 24: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మహిళా పార్లమెంటేరియన్ తొలి మహాసభలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి తొలి వారంలో విజయవాడలో ఈ సభలు నిర్వహించేందుకు సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు సన్నాహాలు చేస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సభల్లో 400కు పైగా మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ సమావేశాలను కామనె్వల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, భారతీయ ఛాత్ర సంసద్ ఫౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. పుణెలోని ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయ పరచనుంది. కొద్ది రోజులుగా ఈ అంశంపై దృష్టి సారించిన కోడెల పుష్కరాల హడావిడి ముగియడంతో దీనికి సంబంధించిన కార్యాచరణపై దృష్టిపెట్టారు. సమావేశాలకు చైర్మన్‌గా కోడెల శివప్రసాదరావు, చీఫ్ ప్యాట్రన్‌గా సిఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారు. అధ్యక్షురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుధా నారాయణ మూర్తిని ఆహ్వానించాలని యోచిస్తున్నారు. సమావేశాల నిర్వహణపై ఎపి సభాపతి ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధి రాహుల్ వి కరాడ్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. మహారాష్టల్రో రాహుల్‌కు చెందిన గ్రూప్ 79 విద్యాసంస్థలను నిర్వహిస్తోంది. ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ పేరుతో ప్రజాపాలన రంగంలో శిక్షణను ఇచ్చే విద్యాసంస్థ కూడా ఇందులో ఉంది. యునెస్కో సైతం ఇందులో భాగస్వామ్యం కాబోతోంది. మహిళా ప్రోత్సాహం - ప్రజాస్వామ్యం పటిష్టత అనే అంశంపై మూడు రోజులు పాటు విభిన్నమైన అంశాలు చర్చిస్తారు. తొలిరోజు మహిళా సాధికారత- రాజకీయ సవాళ్లు, వ్యక్తిత్వ నిర్మాణం- భవిష్యత్ దార్శనికత, గురుశిష్యుల సంబంధాల పెంపు అనే అంశాలపై చర్చిస్తారు. రెండోరోజు మహిళల స్థితిగతులు నిర్ణయాత్మక శక్తి, మీకు మీరే సాటి అనే అంశాలపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. మూడో రోజు మహిళా సాధికారతకోసం పరుగు నిర్వహిస్తారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు ఉండాలని సభాపతి భావిస్తున్నారు.