తెలంగాణ

నేత్ర చికిత్సలకు హబ్ హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: నేత్రవైద్య చికిత్సలకు, ఉన్నత స్థాయి వైద్య ప్రమాణాలతో నేత్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందని ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. బుధవారం ఇక్కడ ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో ది సృజన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్‌ను ఐటి రంగ నిపుణులు బి మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిరామారావు మాట్లాడుతూ నేత్ర రోగులకు ఎల్‌వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు. వైద్య నైపుణ్యం, ఆధునిక శస్తచ్రికిత్సల్లో ఎల్‌వి ప్రసాద్ సంస్థ ముందుందని, ప్రపంచ దేశాల్లోని ప్రజలు కంటి వైద్యానికి హైదరాబాద్‌కు వస్తున్నారన్నారు.
ఈ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ గుళ్లపలిల ఎన్‌రావు సృజన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అందించనున్న సేవలను వివరించారు.
బుధవారం హైదరాబాద్‌లో ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో ది సృజన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కెటిఆర్, ఐటి నిపుణుడు బి.వి.మోహన్‌రెడ్డి