రాష్ట్రీయం

మెట్రో ప్రాజెక్టు టెండర్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 25: విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి తొలిదశలో పిలిచిన టెండర్ల ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ పూర్తి చేయకపోవడంతో ఆ టెండర్లు రద్దయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వాటాగా తొలిదశలో 300 కోట్లు విడుదలయ్యాయి. దీంతో భూసేకరణ పనులు ఊపందుకోబోతున్నాయి. భూసేకరణ చేపట్టాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలందాయి. త్వరలో తిరిగి టెండర్లు పిలుస్తారని అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌పి రామకృష్ణారెడ్డి తెలిపారు. గత డిసెంబర్‌లో రైల్వే స్టేషన్ వయా ఏలూరు రోడ్డు, నిడమనూరు వరకు కూడిన కారిడార్-1కోసం రూ.780 కోట్ల వ్యయంతో టెండర్లను పిలిచారు. దీనికోసం 11 సంస్థలు టెండర్లు వేశాయి. అయితే భూసేకరణకు నిధులు సకాలంలో సర్దుబాటు కాకపోవటం లాంటి సమస్యలు టెండర్ల ఖరారుకు అవరోధంగా మారాయి.