రాష్ట్రీయం

బిజెపి ఏజెంట్‌లా కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఒప్పందాల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్న అంశాలపై శుక్రవారం గాంధీ భవన్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కెసిఆర్ తప్పిదాలను ఎత్తిచూపుతామని ఆయన చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సదస్సులో ప్రాణహిత చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టులపై నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. రిటైర్డు ఇంజనీర్లు, నిపుణులు ఈ సదస్సులో మహా ఒప్పందంలో అవకతవకలను ఎత్తిచూపుతారన్నారు. బిజెపి ఏజెంటులాగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. పోలవరం కోసం ఆంధ్రాకు ఏడు మండలాలు, రెండు లక్షల ఎకరాల భూమిని ధారాదత్తంచేసిన ఘనత కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. మహారాష్టల్రో మూడు వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని, ఈ భూమిని తీసుకునే బదులు మొత్తం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని ఉత్తమ్ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వాస్తవ పరిస్థితి వివరించి కేంద్రంపై వత్తిడి తెచ్చి మహారాష్ట్ర నుంచి మూడు వేల ఎకరాలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. అలాగే మేడిగడ్డకు ప్రాజెక్టు ప్రదేశాన్ని తరలించడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ. 50 వేల కోట్లకు పెరిగిందన్నారు. ఈ భారాన్ని తెలంగాణ ప్రజలపై రుద్దడం తగదన్నారు. ఖజానాపై భారం పడే విధంగా కెసిఆర్ వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రేక్షక పాత్ర వహించదన్నారు. కాళేశ్వరంవల్ల 40 లక్షల ఎకరాలకు సాగునీటి లభ్యత వస్తుందన్న కెసిఆర్ వాదనలో నిజం లేదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కేవలం 16 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ప్రాజెక్టులకు, రైతాంగానికి తాము వ్యతిరేకం కాదన్నారు. కాని రాష్ట్రప్రయోజనాలను తాకట్టుపెట్టే విధంగా మహారాష్టత్రో ఒప్పందం ఖరారు చేసుకోవడం, దీనిపై విపక్షాలకు ముందుగా స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం, విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం కెసిఆర్ దుందుడుకు విధానాలకు పరాకాష్ట అని ఆయన అన్నారు.