ఆంధ్రప్రదేశ్‌

ఏపిలో పెరిగిన ఎయిర్ ట్రాఫిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్‌లో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రైవేట్ ఎయిర్ లైన్ సర్వీసులను పెంచాలని రాష్ట్రప్రభుత్వం ఈ సంస్థలతో త్వరలో సంప్రదింపులు జరపనుంది. గత 12 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ ట్రాఫిక్ 47 శాతం పెరిగింది. త్వరలో దుబాయ్, కౌలాలంపూర్, సింగపూర్‌కు కొత్త విమాన సర్వీసులను నేరుగా ఆంధ్ర నుంచి వెళ్లేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విశాఖపట్నం నుంచి శ్రీనగర్, అహ్మదాబాద్, ఉదయ్‌పూర్, కోయంబత్తూర్‌కు సర్వీసులు నడపనున్నారు. హైదరాబాద్, విజయవాడ మధ్య స్పైస్ జెట్ మరొక సర్వీసును నడపనుంది. తిరుపతి నుంచి ఢిల్లీకి హైదరాబాద్ మీదుగా సర్వీసు త్వరలో ప్రారంభం కానుంది. రాజమండ్రి నుంచి బెంగళూరు వయా చెన్నై, విశాఖపట్నం నుంచి తిరుపతికి వయా విజయవాడ సర్వీసులను నడిపేందుకు ప్రభుత్వం వివిధ ప్రైవేట్ విమాన ఆపరేటర్లతో మాట్లాడుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆంధ్ర నుంచి విమానాశ్రయాల ద్వారా 11,86,191 మంది ప్రయాణీకులు ప్రయాణించగా, గత ఏడాది ఇదే కాలంలో 8,07,158 మంది ప్రయాణీకులు విమాన సర్వీసులను వినియోగించుకున్నారు. ఈ ఏడాది విశాఖ నుంచి రెండు మిలియన్ల మంది ప్రయాణించే అవకాశం ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 42 శాతం, రాజమండ్రిలో 36 శాతం ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది. ఆంధ్రప్రభుత్వం విమాన ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించడం వల్ల విమాన చార్జీలు తగ్గడంతో ప్రజలు విమాన ప్రయాణంపై మొగ్గుచూపుతున్నారు.

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం, ఆగస్టు 26: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంద్రలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో కూడా రాగల 24 గంటల్లో ఒక మోస్తరు వర్షాలు, అనంతరం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.