ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి అడ్డంకి చంద్రబాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అడ్డంకి అని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి పోలవరం ప్రాజెక్టు తీసుకుని రావడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టం లేదనే విషయం తేటతెల్లమవుతోందని ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. అసలు గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల ఎపికి జరిగే నష్టమేంటో చంద్రబాబు గ్రహించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికిగానీ, కేంద్రానికిగానీ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లడం ససేమిరా ఇష్టం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారని, ప్రతి నెలా తానే పోలవరం పనులను పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నట్లు తెలిసిందని ఆయన చెప్పారు. పోలవరంపై ముఖ్యమంత్రి పర్యవేక్షణ అవసరం లేదని, రాష్ట్ర పునర్ విభజన చట్టంలోనే పోలవరం నిర్మాణ పనులు, అనుమతులు, పర్యవేక్షణ, పునరావాస వసతి 2018లోగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును కేంద్రానికి వెంటనే అప్పగించి 2018లోగా పూర్తి అయ్యే విధంగా కేంద్రంపై పోరాటం చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.
ఇలాఉండగా ఎపిపిసిసి అధికార ప్రతినిధిగా జి.సూర్యనారాయణ రెడ్డిని పార్టీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నియమించారు.