ఆంధ్రప్రదేశ్‌

గాజువాక గణపతికి 12,500 కిలోల లడ్డూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, ఆగస్టు 26: విశాఖ మహానగర పరిధిలోని గాజువాకలో ఏర్పాటు చేస్తున్న దేశంలోకెల్లా అతిపెద్ద గణపతికి.. అతిపెద్ద లడ్డూను అందించడానికి తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలోని సురుచి సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత పోలిశెట్టి మల్లికార్జునరావు (మల్లిబాబు) తెలిపారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని ఖైరతాబాద్ మహాగణపతికి మహాలడ్డూలను సమర్పించడంలో సుప్రసిద్ధమైన ఈ సంస్థ, స్వరాష్ట్రంలోని గాజువాక గణపతికి ప్రపంచ రికార్డును స్థాపించే లడ్డూను సమర్పించనుంది. శుక్రవారం తాపేశ్వరంలో విలేఖరుల సమావేశంలో సురుచి అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఈ వివరాలు తెలిపారు. గత ఏడాది గుజరాత్‌లోని అంబాలా పట్టణంలో అరసూరి అంబాజీ మాత దేవస్థానం ట్రస్టు తయారుచేసిన 11,115 కిలోల లడ్డూయే ఇంతవరకు గిన్నీస్ రికార్డని, దాన్ని మించి ఈ వినాయక చవితికి 12,500 కిలోల మహాలడ్డూను గాజువాక గణపతికి అందించనున్నట్లు తెలిపారు. 12,500 కిలోల ఈ మహాలడ్డూ తయారీకి రూ.30 లక్షల వ్యయం అవుతుందని, ఈ సొమ్మును తమ రక్తసంబంధీకులు, స్నేహితుల నుండి విరాళాల రూపంలో సేకరిస్తున్నట్లు మల్లిబాబు వివరించారు. మహాలడ్డూ తయారీలో 2,400 కిలోల నెయ్యి, 600 కిలోల నూనె, 3,350 కిలోల శనగపిండి, 4,950 కిలోల పంచదార, 400 కిలోల జీడిపప్పు, 200 కిలోల బాదం పప్పు, 125 కిలోల యాలకులు, 30 కిలోల పచ్చకర్పూరం వినియోగించనున్నట్టు తెలిపారు. ఈ నెల 28న సురుచి ఆవరణలో నిర్మించిన మహాలడ్డూల తయారీ ప్రాంగణంలో గణనాథుని ప్రతిష్ఠించి, తనతో పాటు 20 మంది సిబ్బంది గణేశ మాలాధారణ చేసి, లడ్డూల తయారీ దినుసులు సిద్ధంచేస్తామన్నారు. సెప్టెంబర్ 2న మహాలడ్డూ తయారీ ప్రారంభిస్తామని, 3న లడ్డూల అలంకరణ, 4న లడ్డూలను ప్రజల సందర్శనకు ఉంచి, ఆ సాయంత్రం భారీ క్రేన్ల సహాయంతో వ్యాన్‌లో ఉంచి, విశాఖపట్టణం, ఖైరతాబాద్‌కు తరలిస్తామని మల్లిబాబు వివరించారు.
5న వినాయక చవితి రోజున హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రత్యేక పూజ అనంతరం 5 వందల కిలోల మహాలడ్డూను గణేశుని చేతిలో అలంకరిస్తారని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని చేపల బజార్ గణేశునికి 100 కిలోలు, అయినవిల్లి, బిక్కవోలు, రామచంద్రపురం పట్టణంలోని దఫేదార్ నుయ్యి గణేశులకు 50 కిలోల లడ్డూలను, కాకినాడ గణపతికి 25 కిలోల లడ్డూను ఉచితంగా సమర్పిస్తున్నట్లు మల్లిబాబు తెలిపారు.

గాజువాక గణేశునికి సమర్పించనున్న 12,500 కిలోల లడ్డూ నమూనా