తెలంగాణ

కాల్ డేటా రికార్డులను విశే్లషిస్తున్న సిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: గ్యాంగ్‌స్టర్ నరుూం నేర కార్యకలాపాల్లో కీలక సమాచారం సేకరించేందుకు సిట్ ఒక అడుగు ముందుకేసింది. మరో వైపు నరుూమ్ అనుచరులమంటూ క్రాంతి సేన పేరిట టీవీ చానళ్లకు లేఖ అందడం కలకలం కలిగించింది. పట్నాయక్ పేరిట వచ్చిన ఈ లేఖలో తాము నరుూమ్ అనుచరులమని, తమ జోలికి వస్తే దాడులుచేస్తామని హెచ్చరించారు. కాగా ఇంతవరకు అరెస్టయిన నరుూమ్ అనుచరులు, నరుూమ్ నేరాలకు బలై ఫిర్యాదుచేసిన వారి మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్లను సేకరించి వాటి కాల్ డేటా రికార్డును విశే్లషించాలని సిట్ నిర్ణయించింది. ఇంతవరకు అరెస్టయిన నరుూమ్ అనుచరుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ నంబర్లు, గతంలో కొంతకాలం వినియోగించి పక్కనపెట్టేసిన ఫోన్ల నంబర్లను సిట్ సేకరించింది. అలాగే నరుూమ్ వేధింపులకు గురయ్యామని, విఐపిలకు కూడా నరుూమ్ సంబంధం ఉందని అభియోగాలు మోపిన వారి ఫోన్ నంబర్లను కూడా సేకరించి కాల్‌డేటా రికార్డు విశే్లషణ చేసేందుకు సిట్ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ శాసనమండలికి చెందిన ఒక ఎమ్మెల్సీ పేరును ఒక ఫిర్యాదుదారుడు ప్రముఖంగా ప్రస్తావించిన నేపథ్యంలో సిట్ ఆధారాల సేకరణ పనిలో పడింది. భువనగిరికి చెందిన గణప నాగేందర్ అనే వ్యాపారవేత్త నరుూమ్ తనను బెదిరించాడని, తాను ఒక ఎమ్మెల్సీని కూడా సంప్రదించానని భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. నల్లగొండకు చెందిన ఒక స్కూలు టీచర్ కూడా నరుూమ్ బాధితుల్లో ఒకడని సిట్ గుర్తించింది. ప్రతి సంవత్సరం ఆ టీచర్ దీపావళి సందర్భంగా బాణాసంచా వ్యాపారం చేస్తాడు. తనకు పదిలక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే ఖతం చేస్తానంటూ నరుూమ్ బెదిరించేవాడని పోలీసులకు ఆ టీచర్ ఫిర్యాదు చేశాడు. తనను నరుూమ్ బారి నుంచి కాపాడాలని ఆ టీచర్ నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధిని సంప్రదించాడని సిట్ వర్గాలు తెలిపాయి. తమ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నరుూమ్ చేతిలో గల్లంతయ్యారంటూ ఇంతవరకు సిట్ పోలీసులకు నల్లగొండ జిల్లానుంచి ఫిర్యాదులందాయి. ఈ దిశగా కూడా సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. కాగా నరుూమ్ సోదరుడు ఫరుూమ్ దంపతులకు పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో వారిని శుక్రవారం రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు పంపారు. నరుూమ్ భార్య, సోదరిని పిటి వారెంట్‌పై మహబూబ్‌నగర్ జైలు నుంచి హైదరాబాద్ జైలుకు తరలించాలని సిట్ పోలీసులు ఇదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.