ఆంధ్రప్రదేశ్‌

తాడేపల్లిలో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, ఆగస్టు 26: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ సమీపంలో శుక్రవారం తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. గుంటూరుకు చెందిన యువకులు ఆటోలో విజయవాడకు బయలుదేరారు. కొలనుకొండ సమీపంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది. రక్షక్ పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని జీపుని నిలిపి క్షతగాత్రులకు సహాయ చర్యలు ప్రారంభించారు. కాగా అదే సమయంలో గుంటూరు నుండి విజయవాడ వైపువెళుతున్న ఒక లారీ రోడ్డు పక్కనే ఉంచిన పోలీస్ వాహనాన్ని, పక్కనే ఉన్న వ్యక్తులను ఢీకొట్టింది. ఈఘటనలో పేర్ బహదూర్, అరుణ్‌కుమార్ అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన రాంబహదూర్, రాజాలను విజయవాడలోని జిజిహెచ్‌కి తరలించగా అక్కడ వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. తాడేపల్లి పిఎస్ హెడ్‌కానిస్టేబుల్ సైదా, పోలీస్ జీప్ డ్రైవర్ లూర్థుబాబు సైతం గాయపడ్డారు.