ఆంధ్రప్రదేశ్‌

సామూహిక వరలక్ష్మీ వ్రతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఆగస్టు 26 : ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. శ్రావణ మాసం నాలుగవ శుక్రవారం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ మండపం, అక్కమహాదేవి అలంకరణ మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించగా వెయ్యిమందికి పైగా ముత్తయిదువులు పాల్గొన్నారు. కాగా దేవస్థానం అభ్యర్థన మేరకు స్థానిక గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాసులు, సిబ్బంది వరలక్ష్మీ వ్రతం గురించి గిరిజన చెంచు మహిళలకు అవగాహన కల్పించారు. దీంతో కర్నూలు, ప్రకాశం, గుంటూరుకు చెందిన 20 చెంచుగూడెంల నుంచి 330 మంది గిరిజన చెంచు ముత్తయిదువులు హాజరయ్యారు. వ్రతానికి కావాల్సిన పూజాద్రవ్యాలను దేవస్థానం వారే సమకూర్చారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి ముత్తయిదువుకు అమ్మవారి శేష వస్త్రం రవికె, పూలు, గాజులు, చెంచు మహిళలకు చీర, రవికె అందజేశారు. కాగా ఇక సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శుక్రవారం శ్రీశైలం మహాక్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి నారాయణ భరత్‌గుప్త ఆధ్వర్యంలో వేదపండితులు వరుణయాగం ప్రారంభించారు.

గాంధీబాబుకు థెరీసా పురస్కారం
హైదరాబాద్, ఆగస్టు 26: గిరిజనులు అభ్యున్నతికి పాటుపడుతున్న ఎఎస్‌డిఎస్ డైరెక్టర్ వి గాంధీబాబుకు మదర్ థెరీసా సేవాపురస్కారం లభించింది. పదేళ్లుగా గిరిపుత్రులకు విద్య, వైద్యం అందిస్తూ ఎనలేని కృషి చేస్తున్నారు. ఆదివాసీ బాలబాలికల్లో సర్వే నిర్వహించడం ద్వారా పోష్టికాహార లోపం ఉందని గుర్తించి వారిని ఎన్‌ఆర్‌సిలో చేర్పించడంతో ఎఎస్‌డిఎస్ ముందుంది. 3542 మందికి పౌష్టికాహారం అందించారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య చికిత్సలు, గర్భిణీలకు టీకాలు, ఐఎఫ్‌ఏ మాత్రలు అదించడంతో ఎంతో కృషి చేస్తున్నారు. ఎఎస్‌డిఎస్ ద్వారా మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి 8616 మందికి వైద్య సేవలు అందించారు. 157 అత్యవసర చికిత్సలకు సంస్థ సహాయ, సహకారాలు అందిస్తోంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా 106 జయంతి సందర్భంగా ఎఎస్‌డిఎస్ డైరెక్టర్ గాంధీబాబును ఈ అవార్డుకు ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మదర్ థెరీసా పురస్కారం ప్రదానం చేశారు.

అక్షయగోల్డ్ కేసులో
సిఐడి చార్జిషీటు

ఒంగోలు, ఆగస్టు 26: అక్షయగోల్డ్ కేసులో ఒంగోలు జిల్లాకోర్టులో ఛార్జీషీటును సిఐడి అధికారులు శుక్రవారం దాఖలు చేశారు. ఈ కేసులో 37మంది నిందితులను చేరుస్తూ 2012 పేజిల ఛార్జీషీటును సిఐడి ఎఎస్‌పి మేరి ప్రశాంతి నేతృత్వంలోని అధికారుల బృందం జిల్లా కోర్టులో దాఖలు చేసింది. సుమారు 330కోట్లరూపాయలు మోసం జరిగినట్లు ఛార్జీషీటులో సిఐడి పేర్కొంది. రాష్టవ్య్రాప్తంగా 2500 ఎకరాల భూములను ప్రభుత్వం సీజ్ చేసింది. పది కోట్లరూపాయల విలువైన బ్యాంకు డిపాజిట్లను ప్రభుత్వం సీజ్ చేసింది. 2012 నుండి అక్షయగోల్డ్ వ్యవహరం జరుగుతూనే ఉంది. సుమారు వెయ్యికోట్ల రూపాయల వరకు బాధితులు డిపాజిట్లు చేసినట్లు సమాచారం. అక్షయగోల్డ్ వ్యవహరం మరవకముందే అగ్రిగోల్డ్ వ్యవహరం తెరపైకి వచ్చింది. కోట్లరూపాయల మేర యజమాన్యం డిపాజిట్లను సేకరించి బాధితులకు మొండి చేయి చూపింది.

దీపావళికి ప్రత్యేక రైళ్లు

విజయవాడ, ఆగస్టు 26: దీపావళి సందర్భంగా రైల్వేశాఖ హౌరా - తిరుపతి మధ్య 14 ఎసి సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైళ్లను నడుపబోతున్నది. 02855 నెంబరులో ఒక రైలు, అక్టోబర్ 4, 11, 18, 25, నవంబర్ 1, 8, 15 తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40కు బయలుదేరి మరుసరటి రోజు 2.30కు తిరుపతికి చేరుతాయి. తిరుగు ప్రయాణంలో 02858 నెంబరుతో అక్టోబర్ 5, 12, 19, 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో తిరుపతిలో సాయంత్రం 3.55 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30కు హౌరాకు చేరుతుంది. ఖరగ్‌పూర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖ, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి రైల్వేస్టేషన్లలో ఆగుతాయి.