ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై శంకలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశంలో అధికారిక నివేదికలను పక్కన పెట్టి రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు బిజెపి అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినట్టు ఎపి బిజెపి అధ్యక్షుడు, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు వెల్లడించారు. విశాఖలో శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ హోదా విషయంలో నెలకొన్న సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హోదా ప్రయోజనాలు సమకూరేలా కేంద్రం ఏం చేయాలన్నదానిపై సమాలోచనలు చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్ కేటాయించాలన్న స్పష్టత విభజన చట్టంలో ఎక్కడా లేదని, అధికారిక కమిటీ వేసి జోన్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను నివేదించాల్సిందిగా సూచించారన్నారు. ఎపి జీవనరేఖ పోలవరం ప్రాజెక్టుపై ఎటువంటి అనుమానాలకు తావు లేదని, ప్రాజెక్టు పూర్తికి కేంద్రం కట్టుబడి ఉందని హరిబాబు స్పష్టం చేశారు. తొలి కేబినెట్‌లోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఎపిలో కలుపుతూ ఆర్డినెన్స్ తెచ్చి, అనంతరం పార్లమెంట్ ఆమోదానికి కృషి చేశామన్నారు. జాతీయ ప్రాజెక్టు అంటే 70.30 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చించాల్సి ఉంటుందని, 11వ పంచవర్ష ప్రణాళికలో మాత్రం 90.10 నిష్పత్తిగా పేర్కొన్నారని, దీనికి సరైన నిర్వచనం లేనందునే కొంత గందరగోళం నెలకొందన్నారు. నిధుల విడుదలకు కొన్ని విధివిధానాలుంటాయని, ఏది ఏమైనప్పటికీ పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత ఉండదని భరోసానిచ్చారు. ఇప్పటికే ఎపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమను పూర్తి చేసిందని, ఇదే తీరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగితే అనుకున్న గడువులోగా పోలవరం పూర్తవుతుందన్నారు.
రాజధాని నిర్మాణం, ఆర్థికలోటు భర్తీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ప్యాకేజీ నిధుల మంజూరు వంటి అంశాల్లో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. తాజాగా రాష్ట్రానికి రూ.1976 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్థిక లోటు విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదని, అయినప్పటికీ విడతల వారీగా రూ.4000 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రాజధాని నిర్మాణానికి గతంలో రూ.1500 కోట్లు మంజూరు చేయగా, ఇప్పుడు రూ.450కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు మూడు విడతలుగా రూ.1,050 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. . పలు జాతీయ విద్యా సంస్థల్లో ఇప్పటికే తరగతులు జరుగుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదార్ల నిర్మాణానికి కేంద్రం పెద్దపీట వేసిందన్నారు.