ఆంధ్రప్రదేశ్‌

ప్రజలు మెచ్చుకునేలా పోలీసు వ్యవస్థ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఆగస్టు 26: గుంటూరుజిల్లా మంగళగిరిలోని ఎపిఎస్‌పి ఆరో బెటాలియన్ ప్రాంగణంలో 12 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కార్యాలయ నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప శంకుస్థాపన చేశారు. వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు, వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు, డీజీపీ నండూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిని కృష్ణానదీ తీరాన గుంటూరుజిల్లా పరిధిలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడ నుంచే పరిపాలన మొత్తం చేయాలనే సంకల్పంతో డీజీపీ కార్యాలయాన్ని ఇక్కడ 75వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టినట్లు చెప్పారు. వచ్చే జనవరి నాటికి జి ప్లస్ 2 పద్ధతిలో నిర్మించే ఈ భవనాన్ని పూర్తిచేసి ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు చినరాజప్ప తెలిపారు. మంగళగిరిలోని ఎపిఎస్‌పి ఆరో బెటాలియన్ ప్రాంగణంలో సెక్యూరిటీ బాగుంటుందని పోలీసు ఉన్నతాధికారులకు 20 రెసిడెన్షియల్ క్వార్టర్స్ కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి 23 వరకు జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా పోలీసులు అందించిన సేవలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. ప్రజలు మెచ్చుకునే విధంగా భవిష్యత్తులో కూడా పోలీసు వ్యవస్థ పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. డిజిపి మాట్లాడుతూ ఎపి పోలీసు హెడ్ క్వార్టర్స్‌ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌లో నిర్మించాలని భావించి ప్రతిపాదనలు పంపగా హోంమంత్రి చినరాజప్ప ఆమోదించారని అన్నారు

డిజిపి ఆఫీసుకు శంకుస్థాపన చేస్తున్న చినరాజప్ప, ఇతర మంత్రులు