రాష్ట్రీయం

బాబుకు డప్పులు..బిజెపిపై నిప్పులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండున్నరేళ్ల తర్వాత రాజకీయ వేదిక ఎక్కిన తొలి సభ బిజెపి-కాంగ్రెస్‌పై నిప్పులు కురిపించేలా, తెదేపాకు డప్పుకొట్టేలా మారింది. హోదా, విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన బాబు వైనాన్ని గుర్తు చేయకుండా, విభజన చేసిన కాంగ్రెస్,బిజెపిని లక్ష్యంగా చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఇలాంటి అనుమానాలే తెరపైకి వచ్చాయి.
సభలో ప్రసంగించిన పవన్ ప్రత్యేక హోదా, విభజన అంశాలను ప్రస్తావించారు. ఆ సందర్భంగా బిజెపి,కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ విమర్శలు గుప్పించారు. పనిలోపనిగా ఏపి ఎంపీలకు హిందీ రాదని అంటూ, వాళ్లు హిందీ నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. హోదాను మూడు రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయన్న జైట్లీపైనా విమర్శల వర్షం కురిపించారు. జైట్లీ, వెంకయ్య మాటలు తనకు అసహనం, చికాకు కలిగించాయన్నారు. విభజనకు కాంగ్రెస్ ఎంత కారణమో బిజెపి కూడా అంతే కారణమని, అందుకే ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం చేసిన కాకినాడలో తాను సభ పెడతానని వెల్లడించారు. బిజెపి, కాంగ్రెస్‌ను విభజన అంశంలో తూర్పారపట్టిన పవన్, విభజన చేయమని కోరుతూ రెండుసార్లు లేఖ ఇచ్చిన బాబును, తెదేపాను పల్లెత్తుమాట అనకపోవడం ఆశ్చర్యంతోపాటు అనేక అనుమాలకు కారణమయింది. హోదా కావాలని పార్లమెంటులో డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు, ఇప్పుడు హోదా వస్తే ఏమి వస్తుందనడాన్ని కూడా పవన్ తప్పుపట్టారు. అయితే, అదే మాటన్న చంద్రబాబు గురించి పల్లెత్తు మాట అనక పోవడాన్ని రాజకీయ వర్గాలు తప్పుపడుతున్నాయి. హోదా సంజీవని కాదని బాబు పలుమార్లు చెప్పిన విషయాన్ని పవన్ మర్చిపోయారా? లేక కావాలనే విస్మరించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రాష్ట్భ్రావృద్ధి కోసం బాబు కష్టపడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యను బట్టి, ఈ సభ వెనుక తెదేపా సౌజన్యం ఉందన్న అనుమానాలు విపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ముద్రగడ దీక్షకు అనుమతి అడిగితే కాదన్న ప్రభుత్వం, మందకృష్ణ మాదిగ సభను అడ్డుకున్న పోలీసులు , పవన్ జనసేన దరఖాస్తు చేసుకున్న 20 గంటలకే అనుమతి ఇవ్వడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మూడు అంశాలపై మాట్లాడేందుకే వచ్చానని పవన్ ముందు వెల్లడించారు. అందులో టిడిపి పరిపాలన తీరును వివరిస్తానని చెప్పినా, ప్రసంగంలో ఎక్కడా దానిజోలికి వెళ్లకపోవడం గమనార్హం. కాగా, తనకు కులాలు మతాలు లేవని, అలా ఎవరైనా విమర్శిస్తే తన కోపం నషాళానికి అంటుందని పవన్ చెప్పినప్పటికీ.. శనివారం నాటి పవన్ సభకు హాజరయిన వారిలో కాపు, బలిజలే ఎక్కువమంది కావడం విశేషం. కాగా,పవన్ తన సభను కేవలం తన పార్టీకి బిజెపితో ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించుకునేందుకే వినియోగించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న ఎన్నికల్లో జనసేన-బిజెపి కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం నేపథ్యంలో, వాటికి సమాధానం బిజెపిపై విమర్శల ద్వారా ఇస్తేనే నమ్ముతారన్నట్లుగా ఆయన ప్రసంగించారంటున్నారు.