ఆంధ్రప్రదేశ్‌

ఇక మరింత కచ్చితత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 30: వాతావరణ శాఖ నుంచి ప్రమాద హెచ్చరికలను అందుకున్న వెంటనే తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి ఒక వ్యవస్థను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఎ) అభివృద్ధి చేస్తోంది. నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు కింద రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ (ఎస్‌ఇఒసి)ను ఏర్పాటు చేసి వాటిని వాతావరణ శాఖ హెచ్చరికలతో అనుసంధానం చేయనున్నారు. హుద్‌హుద్ తుపాను తరువాత ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొన్ని బృందాలను ఎన్‌డిఎంఎ పంపించింది. తుపాను వల్ల జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం, పంటలపై ప్రభావాన్ని పరిశీలించింది. తుపాను సమయంలో మంచి ఫలితాలనిచ్చిన చర్యలు, జరిగిన లోపాలు, ముందస్తు చర్యల్లో లోపాల నుంచి నేర్చుకున్న పాఠాలు, సహాయ, పునరావాస చర్యల బలోపేతానికి సంబంధించి సమాచారాన్ని సేకరించింది. ఈ పరిశీలనలో వాతావరణ శాఖ హెచ్చరికలను తుపాను ప్రభావిత ప్రాంతాలకు అన్ని వర్గాలకు చేరవేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తగిన రీతిలో స్పందించలేదని గుర్తించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సమాచారాన్ని వీలైనంత వేగంగా చేరవేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఎస్‌ఇఒసిల ఏర్పాటు సహా జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లకు, స్థానికంగా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల సమాచారం సత్వరమే చేరవేసే వీలు కలుగుతుందని భావిస్తున్నారు. శాటిలైట్, రేడియో, ఇంటర్నెట్, మొబైల్ టెక్నాలజీలను ఉపయోగించుకుని ఈ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. దీనికి తోడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సైరన్‌లను వినియోగించడం ద్వారా సత్వరమే ఈ సమాచారం చేసేందుకు వీలు అవుతుందని భావిస్తున్నారు. హ్యామ్ రేడియోలు, అవి ఉన్న వివరాలు, అధికారులు, తదితర ఫోన్ నెంబర్లు పర్యవేక్షణ అధికారులకు అందుబాటులో ఉంచడం వల్ల సమాచార వ్యవస్థకు ఇబ్బంది కలుగలేదు. సహాయక చర్యల్లో భాగంగా హ్యామ్ రేడియో ఆపరేటర్లను పునరావాసా కేంద్రాలు, జిల్లా, సబ్‌డివిజన్ స్థాయిలో తుపానుకు ముందుగానే ఏర్పాటు చేయడం వల్ల సహాయ కార్యాక్రమాలు వివరాలు తెలుసుకునే వీలు కలిగింది. కొన్ని చోట్ల ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది తమకు కావాల్సిన పరికరాలను, పనిముట్లను తీసుకువెళ్లకుండా అధికార యంత్రాంగంపై ఆధారపడినట్లు గుర్తించారు.