ఆంధ్రప్రదేశ్‌

భూ వివరాలన్నీ కంప్యూటరీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 30: రాష్ట్రంలో నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందించడమే తన ధ్యేయమని, ఇందుకోసం అహర్నిశలు పనిచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలుపుతానని ఆయన స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రొద్దం మండలం పెద్దమంతూరులో ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ జిల్లాలో వేరుశెనగ పంటను రక్షించడానికి మరో రెండు రోజుల పాటు ఇక్కడే బసచేస్తానన్నారు. అనంతపురం జిల్లా అత్యంత కరవు ప్రాంతమని, ఇక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వలస పోతున్నారని, భవిష్యత్తులో తీవ్ర నష్టం జరుగుతుందని భావిస్తున్నారన్నారు. జిల్లా రైతులను ఆదుకోవడానికి తాను శాయశక్తులా కృషి చేస్తానన్నారు. భూమి వివరాలను కంప్యూటరీకరణ చేసి సెల్‌ఫోన్‌లోనే సమాచారం చూసుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామన్నారు. వ్రర్షం నీటిని భూగర్భజలాలుగా మార్చడం, నదులను అనుసంధానం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు. పుష్కరాల సందర్భంగా తాను చేసిన సంకల్ఫం మేరకు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని విజయవంతంగా పూర్తి చేశానన్నారు. గాలేరు, నగరి నుండి కర్నూలు, కడపకు, హంద్రీనీవా నుండి అనంతపురం, చిత్తూరుకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకొన్నానన్నారు. నెలన్నర రోజుల్లో హంద్రీనీవా ద్వారా గొల్లపల్లికి నీరు ఇస్తామన్నారు. మడకశిర వరకు నీటిని తెప్పిస్తామని, చెర్లోపల్లి దాకా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలోని చెరువులన్నింటికి నీరందిస్తానని, అవసరమైన చోట లిఫ్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫ్యూజోమీటర్లు పెట్టి వర్షపాతాన్ని నమోదు చేస్తున్నామని, భూగర్భజలాలు పాతాళానికి పడిపోయిన జిల్లా అనంతపురమని అన్నారు. తర్వాతి స్థానంలో కడప, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలు ఉన్నాయన్నాయన్నారు. సాగు, తాగునీటి సమస్యలు తీరాలంటే పోలవరం పూర్తి కావాలన్నారు.
నేనింత కష్టపడుతున్నా... ఇంకో పార్టీ అవసరమా?
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నాను, ప్రజలే నా దేవుళ్లు, వారి కోసం ఏమైనా చేస్తాను, నేను ఇన్ని చేస్తుంటే మీకు వేరే పార్టీ అవసరమా తమ్ముళ్లూ’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రొద్దం మండలం పెద్దమంతూరు గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక పార్టీ...కాంగ్రెస్ పార్టీ.. మన పొట్టగొట్టి విభజన చేసి భూస్థాపితమైపోయింది, ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి అన్నారు. మరో పార్టీ...వైకాపా దుర్మార్గమైన పార్టీ. ఉన్మాది కంటే భయంకరంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఆపార్టీ ప్రతి పనికి అడ్డు పడుతోందన్నారు. పట్టిసీమ, గాలేరు, నగరి, పోలవరానికి, రాజధానికి అడ్డుపడుతోందన్నారు. హంద్రీనీవాను సైతం అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు మీ దయాదాక్షిణ్యాల వల్ల జరగలేదు, పేద ప్రజానీకం కోసం ఇవన్నీ చేస్తున్నాను, నా అనుభవం ఎంత...నీ అనుభవం ఎంత...అంటూ జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు.