ఆంధ్రప్రదేశ్‌

ముంచెత్తుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వస్తున్న వరదనీరుకు రాష్ట్రంలో అన్ని నదులు ఉప్పొంగుతున్నాయి. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పులిచింతలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ చాలాకాలం తరువాత జలకళతో ఉట్టిపడుతోంది. బ్యారేజీ 20 గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నారు. అటు రాయలసీమలో పెన్నా, కుందు నదులు వరదపోటుతో బీభత్సంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు అన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. బుధవారం తెలంగాణ జిల్లాలన్నింటిలో భారీగా వర్షాలు పడగా, ఏపిలో కాస్త తెరిపినిచ్చాయి. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులూ వరద నీరు రాకతో పూర్తి మట్టాలకు చేరుకున్నాయి.
పులిచింతలకు భారీగా వరద నీరు
గుంటూరు: పులిచింతల బహుళార్ధ సాధక ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది.. రెండేళ్ల క్రితం భారీ వర్షాల కారణంగా నాలుగు టిఎంసిల నీటిని నిల్వచేశారు. ప్రస్తుతం ఎగువ రాష్ట్రాలతో పాటు క్యాచ్‌మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో పెద్దఎత్తున వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45.77 టిఎంసిలు కాగా బుధవారం నాటికి 15.22 టిఎంసిల నీరు చేరింది. అవుట్‌ఫ్లోగా లక్షా 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద సామర్థ్యానికి మించి నీరు ఉన్నందున పులిచింతల నీటిని విడుదల చేసే విషయమై అధికారులు సంశయిస్తున్నారు. పులిచింతల ప్రభావిత ఏపిలో గుంటూరు జిల్లాలో 14, తెలంగాణలో 15గ్రామాలు ముంపునకు గురి కానున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు రాష్ట్రాల అధికారులు యుద్ధప్రాతిపదికన ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో గొల్లపేట, కోళ్లూరు, కామేపల్లి, బోధనం, కేతవరం, చిట్యాల, చిట్యాల తండా, పులిచింత తదితర గ్రామాలు, నల్గొండ జిల్లాలోని చింతిర్యాల, వెల్లటూరు, మాదలవరం గ్రామాలతో పాటు మరికొన్ని ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 6490 కుటుంబాలను, నల్గొండ జిల్లాలో 6769 కుటుంబాలను తరలిస్తున్నట్లు పులిచింతల సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం వెంకటరమణ ఆంధ్రభూమికి తెలిపారు. రాత్రికి వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. పులిచింతలకు వరద నీరు చేరడంతో బెల్లంకొండ, మాచవరం, అచ్చంపేట మండలాల్లోని పలు తండాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంపు భయంతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. సహాయ, పునరావాస కార్యక్రమాలు ఇంకా పూర్తికాక పోవడంతో అటు తెలంగాణ, ఇటు ఏపిలోని ముంపు గ్రామాల నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లాలో ముంపు గ్రామాల ప్రజలకు మాచవరం, రాజుపాలెం, పిడుగురాళ్ల, దాచేపల్లి, అచ్చంపేట ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు.

చిత్రం... ప్రకాశం బ్యారేజీ నుండి సముద్రం వైపు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ

చిత్రం... నీటితో కళకళలాడుతున్న
పులిచింతల జలాశయం