రాష్ట్రీయం

రక్తమోడిన రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు వద్ద ఆటో బోల్తాపడి నలుగురు మృతి చెందగా, అయదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో గ్యాస్ సిలెండర్ లోడుతో వస్తున్న లారీ, కూరగాయల ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
చిల్లకూరు, డిసెంబర్ 23: నెల్లూరు జిల్లా చిల్లకూరు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆటో బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిల్లకూరు మండలంలోని కమ్మవారి పాలెం-కడివేడు గ్రామాల మధ్య బుధవారం వేకువఝామున కోట మండలం చెందోడు గ్రామం నుండి తొమ్మిది మందితో మంది ప్యాసింజర్ ఆటోలో చేపలు కొనుగోలు చేయడానికి నెల్లూరు బయల్దేరారు. కమ్మవారిపాలెం- కడివేడు గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతులు చేసేందుకు తీసిన గుంటను గమనించని ఆటో డ్రైవర్ వేగంగా వచ్చి సడన్ బ్రేక్ వేయడంతో ఆటో అదుపు తప్పి గుంటలో పడి పోయింది. ఈ ఘటనలో మల్లి రాజమ్మ(40), చల్లా రమణమ్మ(50), మల్లి పాపమ్మ(50), ఆటో డ్రైవర్ వలిపి వెంకటేశ్వర్లు(23) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు చల్లా సుజాత, బెల్లంకొండ రమణయ్య, మల్లి రమణమ్మ, తురకా చెంచమ్మ, బల్లి సన్యాసయ్యలకు గాయాలైనాయి. వీరిలో బెల్లంకొండ రమణయ్య, మల్లి రమణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.
శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ..
ఇబ్రహీంపట్నం: గ్యాస్ సిలెండర్ లోడుతో వస్తున్న లారీ కూరగాయల ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం విజయవాడకు సమీపంలోని కొండపల్లిలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం నూజివీడుకు చెందిన వారు ఇబ్రహీంపట్నంలో 10 మంది ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి కూరగాయల ఆటోలో ఎక్కి వెళుతుండగా కొండపల్లి నుంచి గ్యాస్ సిలెండర్ లోడుతో వస్తున్న లారీ, ఆటో కొండపల్లి డిఎవి స్కూలు వద్ద బుధవారం వేకువ జామున ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాచగిరి నాగలక్ష్మి (7) అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారిని 108 అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాచగిరి లక్ష్మీరాణి (2), రాచగిరి రంగమ్మ (55) మృతి చెందారు. ఆంజనేయులు (60), ఆంజనేయులు (35), ఆంజనేయులు (1) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు సిఐ చౌహాన్ పర్యవేక్షణలో ఎస్‌ఐలు కృష్ణ, గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా చిల్లకూరు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు