రాష్ట్రీయం

ఎమ్మెల్యేలకు శిక్షణ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: అసెంబ్లీలో వైకాపా వ్యవహరించిన తీరు రాజ్యాంగ విలువలకు భంగం కలిగించేలా ఉందని టిడిపి నేత డొక్కా మాణిక్యవర ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన బుధవారం పాత్రికేయులతో మాట్లాడుతూ అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌కు అడుగడుగునా ప్రతిపక్షం అడ్డుతగలడం చాలా బాధాకరమని అన్నారు. కాల్‌మనీపై న్యాయవిచారణకు ప్రభుత్వం ఆదేశించినా, ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా, జగన్ మాత్రం తాను చెప్పినట్టే సభ జరగాలని కోరుకోవడం శోఛనీయమని అన్నారు. అంబేద్కర్‌పై చర్చను అడ్డుకోవడం ద్వారా జగన్ దళితుల పట్ల తన చిత్తశుద్ధిని ప్రదర్శించే అవకాశం పోగొట్టుకున్నారని, సరైన సన్నద్ధత లేకుండా సభకు వచ్చి కాల్‌మనీపై సిట్టింగ్ జడ్జితో విచారణ అంటూ సభను అడ్డుకున్నారని అన్నారు. వైకాపా సెల్ఫ్ గోల్ వేసుకుందని, రోజా వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందని అన్నారు. అనిత పట్ల రోజా చేసిన వ్యాఖ్యలపై వ్యక్తిగతంగానైనా క్షమాపణలు చెప్పాలని సలహా ఇస్తున్నామని, సస్పెన్షన్‌పై న్యాయపోరాటం వైకాపా ఇష్టమేనని అన్నారు. సభ తీసుకునే నిర్ణయాన్ని ఎవరూ సవాల్ చేయలేరని ఆర్టికల్ 212 స్పష్టంగా చెబుతోందని, దానిని చదవకుండా వైకాపా ముందుకు వెళ్తోందని అన్నారు. కాల్‌మనీ చర్చను సద్వినియోగం చేసుకోకుండా సభలో నువ్వో నేనో తేల్చుకుందామనే విధంగా వ్యవహరిస్తున్నారని , సభను జరగనివ్వబోమని చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని అన్నారు. బాక్సైట్‌పై సిఎం నిర్ణయాన్ని ప్రశంసించకుండా విమర్శించడం సరికాదని, అసెంబ్లీని బాయ్‌కాట్ చేసి అక్కడ చర్చించుకోవల్సిన అంశాలను జగన్ మీడియా ముందు మాట్లాడుతున్నారని అన్నారు.

ట్రాన్స్‌కో సిఎండికి శౌర్య రత్న అవార్డు

హైదరాబాద్, డిసెంబర్ 23: ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ విద్యుత్ రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు ‘శౌర్య రత్న’ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ సౌర విద్యుత్ సంస్థకు ఉత్తమ ప్రభుత్వ, నోడల్‌స్ ఏజన్సీ సోలార్ ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రకించారు. ఈ అవార్డులను రెన్యువబుల్ ఎనర్జీ ప్రమోషన్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ అవార్డు వచ్చిన సందర్భంగా ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ మాట్లాడుతూ దేశంలోనే నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుత్ పార్కులను ఏర్పాటు చేస్తున్న ఘనత ఆంధ్ర రాష్ట్రానికి దక్కుతుందన్నారు. అనంతపురంలో ఆల్ట్రా మెగా సోలార్ పార్కు 1500 మెగావాట్లు, కర్నూలు ఆల్ట్రా మెగా సోలార్ పార్కు వెయ్యి మెగావాట్లు, కడప ఆల్ట్రా మెగా సోలార్ పార్కు 1000 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, డిస్కాంల ఆర్థిక పరిస్దితిని పెరుగుపరిచేందుకు ఉజ్వల్ డిస్కాం అష్యూరెన్స్ యోజన స్కీంను అమలు పరచాలని ఏపి విద్యుత్ సంస్థలు నిర్ణయించడాన్ని ఏపిఇఆర్‌సి స్వాగతించింది. దీని వల్ల విద్యుత్ సంస్థలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ జి భవానీ ప్రసాద్ తెలిపారు.

సోలార్ సంస్థకు అవార్డు

హైదరాబాద్, డిసెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్ధకు ఉత్తమ ప్రభుత్వ నోడల్ ఏజన్సీ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపి సౌర విద్యుత్ సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ జి ఆదిశేషు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగువేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.