రాష్ట్రీయం

విఐపిలకు ప్రొటోకాల్‌పై వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 23: వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రోటోకాల్ విఐపిలకు సామాన్యులకు టిటిడి కల్పించిన వసతి దర్శన ఏర్పాట్ల వివరాలపై శాసనమండలికి పూర్తి స్థాయిలో వివరాలు తెలపాలని టిటిడికి బుధవారం శ్రీముఖాలు అందాయి. ఈనెల 21న వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారిని దర్శించుకోడానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి 20న తిరుమలకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయనకు వసతి కల్పించడంలో దాదాపు మూడు గంటలపాటు జాప్యం జరిగింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సతీష్‌రెడ్డి శాసనమండలిలో ప్రస్తావించారు. ప్రజాప్రతినిధుల పట్ల టిటిడి అనుసరిస్తున్న తీరును శాసనమండలి తీవ్రంగా తప్పుపట్టినట్టు తెలిసింది. ఈ నేపధ్యంలో వైకుంఠ ఏకాదశి రోజున టిటిడి ప్రోటోకాల్ విఐపిలకు వసతి దర్శన సౌకర్యాలు ఏ ప్రాతిపదికన కేటాయించారో, ఎటువంటి విధివిధానాలు అనుసరించారో పూర్తివివరాలు తెలియజేయాలని, సంబంధిత అధికారులు మండలిలో హాజరుకావాలని టిటిడికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ అంశంపై తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు రిసెప్షన్ అధికారులను విలేఖరులు వివరణ అడగ్గా వారు మాట్లాడడానికి నిరాకరించారు.