తెలంగాణ

శాస్ర్తియత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: కొత్త జిల్లాల ఏర్పాటులో శాస్ర్తియత లేదని ఈ అంశాన్ని జ్యుడిషీయల్ కమిషన్‌కు అప్పగించాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల ముసాయిదాను ప్రజల ముందు పెట్టాలని, గిరిజన జిల్లాలపై స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గద్వాల, జనగాం జిల్లాల ఏర్పాటు కోసం శనివారం ఉదయం ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టిన మాజీ మంత్రులు డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్యకు ఆయన ఆదివారం సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకు ముందు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గద్వాల, జనగాంల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇది ఆత్మ గౌరవం కోసం చేస్తున్న పోరాటం అని తెలిపారు.
మీనాన్ననే విశ్రాంతి తీసుకోమను
తనను గద్వాల కోటలో బొమ్మాళిగా అభివర్ణిస్తూ నిజామాబాద్ టిఆర్‌ఎస్ ఎంపి కవిత చేసిన విమర్శలపై డికె అరుణ తీవ్రంగా ప్రతిస్పందించారు. గద్వాల కోటలో తనను విశ్రాంతి తీసుకోవాలని కవిత చేసిన సూచనను అరుణ ప్రస్తావిస్తూ ప్రజాప్రతినిధిగా తాను ఎన్నడూ విశ్రాంతి తీసుకోలేదని చెప్పారు. ఆమె తన తండ్రి కెసిఆర్‌ను ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సలహా ఇస్తే బాగుంటుందని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మొండి వైఖరి వీడాలని అన్నారు. నిజాలు చెప్పేందుకు ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే ఇక్కడికి రావాలని అన్నారు.
రాచరిక పాలన: పొన్నాల
తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతున్నదని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. జిల్లాలను ఇష్టారాజ్యంగా విభజిస్తున్నారని, ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని అన్నారు. గద్వాల, జనగాం జిల్లాలు ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ప్రజాభిప్రాయం తీసుకోలేదు: రమ్య
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సోదరుని కుమార్తె రమ్య సూచించారు. ప్రజాభిప్రాయం లేకుండా తెలంగాణలో జిల్లాలను విభజిస్తున్నారని విమర్శించారు. ఎంపి కవిత నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఆమె హితవు పలికారు.
నిరంకుశత్వం కనిపిస్తోంది: మంద కృష్ణ
గద్వాల, జనగాం జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అరుణ, పొన్నాల లక్ష్మయ్య చేపట్టిన దీక్షకు ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు ప్రకటించారు. జిల్లాల ఏర్పాటులో నిరంకుశత్వం కనిపిస్తున్నదని విమర్శించారు. వరంగల్, హన్మకొండ విభజన ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా జరిగిందన్నారు.

చిత్రం... డికె అరుణకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేస్తున్న కాంగ్రెస్ నేత దామోదర రాజ నర్సింహ. చిత్రంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ తదితరులు