తెలంగాణ

8న ‘ఉపాధ్యాయ దినోత్సవం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 31 మంది పాఠశాల స్థాయి ఉపాధ్యాయులను ‘ఉత్తమ ఉపాధ్యాయులు’గా ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులను ప్రకటించారు. భారత మాజీ రాష్టప్రతి సర్వేపల్లి రాధకృష్ణన్ జన్మదినోత్సవమైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులను గౌరవించడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే 5న వినాయక చవితి కావడంతో అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని మూడు రోజులు వాయిదా చేశారు. ఈ నెల 8న రవీంద్రభారతిలో అవార్డులు ఇవ్వనున్నారు.
17 మంది టీచర్లు ‘రాష్ట్ర స్థాయి’ (స్టేట్ లెవెల్) అవార్డులకు, 14 మంది టీచర్లు ‘నేషనల్ ఫౌండేషన్ టీచర్ వెల్ఫేర్ అవార్డు’లకు ఎంపికయ్యారు. 8న ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారు. అవార్డు కింద 10 వేల రూపాయల నగదు, బంగారు రంగు తాపిన వెండి పతకం, ఒక సర్ట్ఫికెట్, శాలువాతో సత్కరిస్తారు.
రాష్టస్థ్రాయి అవార్డులకు ఎంపికైన వారు: ఎ.శ్రీనివాస భట్టార్ (జెడ్‌పిహెచ్‌ఎస్ జీళ్లచెరువు, ఖమ్మం), జి.వెంకటేశ్వర్లు (జెడ్‌పిహెచ్‌ఎస్ నారాయణపూర్, నల్లగొండ), డి.రామకుమారి (జెడ్‌పిహెచ్‌ఎస్ ఉప్పరపల్లి వరంగల్), టి.అనురాధ (ఎంపిపిఎస్, వట్టెం, మహబూబ్‌నగర్) ఎం.వెంకటేశ్వర్లు నాయక్ (జెడ్‌పిహెచ్‌ఎస్ వల్లూరు, మహబూబ్‌నగర్), బి. అచ్చయ్య (ఎంపిపిఎస్ సత్తుపల్లి, ఖమ్మం), ఎస్.మురళి (ప్రాథమిక పాఠశాల అంజిపురం, నల్లగొండ), ఎం.శ్రీనివాసులు (జెడ్‌పిహెచ్‌ఎస్, మహబూబ్‌నగర్), కె.రాజవౌళి (జెడ్‌పిహెచ్‌ఎస్ బన్నారం, ఆదిలాబాద్), మాధురి (జెడిపిహెచ్‌ఎస్ మంబాపూర్ రంగారెడ్డి), బి.ప్రభాకర్ (ఎంజెటిబిసిడబ్ల్యుఆర్‌ఎస్ తునికి, మెదక్), ఎ.శ్రీనివాస్‌రావు (ఎస్‌సి ఎయిడెడ్ హైస్కూల్ ఇల్లందు, ఖమ్మం), సిహెచ్ చలపతి (ఎంపిపిఎస్ ఎస్‌సి/బిసి కాలని, చిన్నపెండ్యాల, వరంగల్), ఎస్.సంతోష్‌కుమార్ (ఎంపిపిఎస్ అంకోలి, ఆదిలాబాద్), రామచంద్రయ్య (జెడ్‌పిహెచ్‌ఎస్ వస్పుల, మహబూబ్‌నగర్), ఎండి అన్వర్ (ప్రభుత్వ ఉన్నతపాఠశాల, హన్మకొండ). జి.రమేష్‌రెడ్డి (జడ్‌పిహెచ్‌ఎస్ కీసర, రంగారెడ్డి).
నేషనల్ ఫౌండేషన్ టీచర్ వెల్ఫేర్ అవార్డులకు ఎంపికైన వారు: వి.గురునాథరావు (జెడ్‌పిహెచ్‌ఎస్ కంబాలపల్లి, వరంగల్), డి.మోహన్‌రావు (జిహెచ్‌ఎస్ జుమ్మెరాత్‌పేట, నిర్మల్, ఆదిలాబాద్), పి.ప్రభాకర్‌రెడ్డి (జెడ్‌పిహెచ్‌ఎస్ ఎంజెపల్లి, ఖమ్మం), చీకోటి మహేశ్వర్ (జెడ్‌పిహెచ్‌ఎస్ సముద్రాల, కరీంనగర్), జి.ప్రభాకర్ (జెడ్‌పిహెచ్‌ఎస్ బినోల, నిజామాబాద్), ఎండి ఖలీల్ అహ్మద్ (ప్రభుత్వ ఉన్నతపాఠశాల (బాలికలు), కోనాపాలమూర్, మహబూబ్‌నగర్), ఖాజా తఖీయుద్దీన్ (ప్రభుత్వ ఉన్నతపాఠశాల, మోజాంషాహి, హైదరాబాద్), కె.దేవేందర్ (ఎయిడెడ్ హైస్కూల్, సింగరేణి కాలరీస్, కొత్తగూడెం), బి.రాధాకృష్ణమూర్తి (యుపిఎస్ తీగారం, వరంగల్), ఆర్.సతీష్‌బాబు (ఎంపిపిస్ బుర్కపిట్టతండా, నల్లగొండ), సయ్యద్ సందాని (యుపిఎస్ నర్సాపూర్, మెదక్), డి.మోహన్‌దాస్ (ఎంపిపిఎస్ మల్లారం, కరీంనగర్), కె.పి.జ్యోతి (జిపిఎస్ నాంపల్లి, హైదరాబాద్).