రాష్ట్రీయం

తాపేశ్వరం కేంద్రంగా పోటాపోటీగా లడ్డూల తయారీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, సెప్టెంబర్ 6: వినాయక చవితి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామానికి చెందిన రెండు స్వీట్ల తయారీ సంస్థలు పోటాపోటీగా తయారుచేసిన రెండు భారీ లడ్డూలు మంగళవారం విశాఖపట్నం, విజయవాడ తరలివెళ్లాయి. గ్రామానికి చెందిన సురుచి, భక్తాంజనేయ స్వీట్‌స్టాల్స్ యాజమాన్యాలు ఈ ఏడాది గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కడమే ధ్యేయంగా భారీ లడ్డూలు తయారుచేయాలని నిర్ణయించాయి. పోటాపోటీగా సాగిన ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ సంస్థ 31.5 టన్నులు, సురుచి సంస్థ 29.7 టన్నుల లడ్డూలు తయారుచేశాయి. 31.5 టన్నుల లడ్డూను విజయవాడలోని డూండీ గణేష్ చేతిలో అలంకరణకు, 29.7 టన్నుల లడ్డూను విశాఖ గాజువాకలోని గణేష్ చేతిలో అలంకరణకు తరలించారు. తొలుత సురుచి సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు గిన్నిస్ లక్ష్యంగా 12,500 కిలోల లడ్డూ తయారుచేయనున్నట్టు ప్రకటించారు. గతంలో లడ్డూతో గిన్నిస్ రికార్డులకు ఎక్కిన భక్తాంజనేయ సంస్థ అధినేత సలాది శ్రీనుబాబు 13వేల కిలోలకు పైగా బరువైన లడ్డూ తయారుచేయనున్నట్టు ప్రకటించారు. ఇలా రెండు సంస్థల మధ్య గిన్నిస్ రికార్డు ధ్యేయంగా పోటీ వాతావరణం ఏర్పడటంతో ఎవరెవరు ఎంత బరువైన లడ్డూ తయారుచేస్తున్నారనే విషయం బయటకు పొక్కకుండా తయారీ ప్రారంభించారు. చివరకు సురుచి సంస్థ 29,700 కిలోల లడ్డూ తయారుచేయగా, భక్తాంజనేయ సంస్థ 31,500 కిలోల లడ్డూ తయారుచేశారు. మంగళవారం క్రేన్ల సాయంతో ప్రత్యేక వాహనాలపై ఈ లడ్డూలను ఉంచి, విశాఖపట్నం, విజయవాడ తరలించారు. ఈ తరలింపును వీక్షించడానికి భారీగా ప్రజలు తరలివచ్చారు.