రాష్ట్రీయం

దద్దరిల్లిన ఏపి అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్రం చేసిన ప్రకటనపై గురువారం శాసనసభ నినాదాలతో దద్దరిల్లింది. ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అంటూ వైకాపా ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. స్పీకర్ కూర్చున్న సీటు పక్కన కూడా నిలబడి నినాదాలు చేస్తూ అజెండా ప్రతులను చించివేసి గాలిలోకి ఎగరవేశారు. దీంతో సభలో ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష సభ్యులను శాంతింప చేసేందుకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేసిన ఏ ప్రయత్నాలూ ఫలించలేదు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన పదే పదే ప్రతిపక్ష పార్టీ సభ్యులను కోరారు. అయితే ప్రత్యేక హోదాపై నేరుగా చర్చను చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభలో తీవ్రస్ధాయిలో గందరగోళం నెలకొంది. ఎవరేమి మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొనడంతో సభను స్పీకర్ మూడుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
తొలుత సభ ప్రారంభమైన సమయంలో విపక్ష ఎమ్మెల్యేలు సభలో లేరు. అజెండాలో ప్రస్తావించినట్లుగా స్పీకర్ తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. సభలో మూడు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వడగాడ్పుల మృతులపై సమాధానం ఇస్తుండగా, వైకాపా ఎమ్మెల్యేలు సభలోకి వచ్చారు. నల్లచొక్కాలు ధరించిన వైకాపా ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు, సిఎం డౌన్ డౌన్, సిఎం రాజీనామా చేయాలి అంటూ పోడియం వద్దకు వెళ్లారు. ఈ అంశంపై సభలో చర్చ ఉంటుందని, ముఖ్యమంత్రి దీనిపై ప్రకటన చేస్తారని, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ చర్చలో పాల్గొనాలని స్పీకర్ కోరారు. ఇదే విషయాన్ని మంత్రి యనమల రామకృష్ణుడు పదే పదే చెప్పినా విపక్ష ఎమ్మెల్యేలు శాంతించలేదు. ఒక దశలో యనమల మాట్లాడుతూ సభ్యులు సభను సజావుగా సాగనివ్వకుండా అడ్డుపడితే సభ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు.
ఈ సందర్భంగా స్పీకర్ ప్రతిపక్షనేత జగన్‌ను మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. జగన్ ప్రత్యేక హోదాపై మాట్లాడుతుండగా, ఆ సబ్జెక్టులోకి వెళ్లరాదంటూ స్పీకర్ మైక్‌ను కట్ చేశారు. దీంతో పోడియం నుంచి తమ సీట్లలోకి వచ్చిన వైకాపా ఎమ్మెల్యేలు మళ్లీ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు పోడియం నుంచి వెళ్లకపోవడంతో స్పీకర్ సభ ప్రారంభమైన 40 నిమిషాలకే సభను వాయిదా వేశారు. అనంతరం గంట తర్వాత సభ మళ్లీ ప్రారంభమైంది. కాని సభ నియంత్రణలోకి రాకపోవడంతో స్పీకర్ సభను మరోసారి 11 గంటల సమయంలో వాయిదా వేశారు. ఆ తరువాత కూడా పరిస్థితి అలాగే కొనసాగింది.

చిత్రం.. గురువారం అసెంబ్లీ సమావేశాలకు ముందు బిఎసి సమావేశం నిర్వహించి సభ్యులతో మాట్లాడుతున్న ఏపి స్పీకర్ కోడెల శివప్రసాదరావు