తెలంగాణ

అమెరికాలో తెలంగాణ పర్యాటక రోడ్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణ పర్యాటక ప్రాంతాల గురించి అన్ని దేశాల్లోనూ ప్రచారం నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ పర్యాటక రంగంపై ప్రచారం కోసం రోడ్ షో నిర్వహించారు. నూతన పర్యాటక విధానం ప్రకటించిన తరువాత రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటామని మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, నాగరికత, ప్రాచీనతలపై పరిశోధన జరపనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. పర్యాటక రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించాలి అనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.